గ్యాంబ్లింగ్ కేసులో 'ప్రేమ పావురాలు' హీరోయిన్ భర్త అరెస్టు

బుధవారం, 3 జులై 2019 (17:33 IST)
'ప్రేమ పావురాలు' పేరుతో తెలుగులోకి డబ్బింగ్ అయిన బాలీవుడ్ చిత్రం 'మైనే ప్యార్ కియా'. ఈ చిత్రంలో హీరోగా సల్మాన్ ఖాన్ నటిస్తే హీరోయిన్‌గా భాగ్యశ్రీ నటించింది. 1989లో వచ్చిన ఈ చిత్రం యావత్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపింది. ముఖ్యంగా ఈ చిత్రంలో నటించిన భాగ్యశ్రీ యావత్ భారతాన్ని ఆకర్షించింది. సూరజ్ బర్జాత్యా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రామ్ లక్ష్మణ్ - అసద్ భోపాలీలు సంగీతం సమకూర్చారు.
 
ఇదిలావుంటే భాగ్యశ్రీ భర్త హిమాలయ దాసాని తాజాగా అరెస్టు అయ్యారు. గ్యాంబ్లింగ్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని అంబోలి పోలీసు అధికారుల సమాచారం మేరకు... హిమాలయను అతని నివాసంలో నిన్న అరెస్ట్ చేసి, స్థానిక కోర్టులో హాజరుపరిచారు. వెంటనే ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యాపారవేత్త అయిన హిమాలయ సినీ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం గొంతు నొప్పి అంటే గొంతు నొక్కాను.... అంతే...