Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆరడుగులుండే వారిలో ఆ మ్యాటరుండదు... కాయ కచేరీ.. ఆగని అలీ నోటి దూల...

హాస్య నటుడు అలీ డబుల్ మీనింగ్ డైలాగులకు అడ్డుకట్ట పడే ప్రసక్తే లేదని మరోసారి తేటతెల్లమైంది. ఆమధ్య అనుష్క తొడలు, సమంత బొడ్డు అంటూ పబ్లిక్ ఫంక్షన్లలో మాట్లాడి... ఆ తర్వాత తన వ్యాఖ్యల పట్ల హీరోయిన్లు ఏమీ అనుకోరని తను అనుకుంటున్నట్లు వివరణ ఇచ్చారు. ఐతే ఆ

Advertiesment
Actor ali vulger comments
, సోమవారం, 29 ఆగస్టు 2016 (18:38 IST)
హాస్య నటుడు అలీ డబుల్ మీనింగ్ డైలాగులకు అడ్డుకట్ట పడే ప్రసక్తే లేదని మరోసారి తేటతెల్లమైంది. ఆమధ్య అనుష్క తొడలు, సమంత బొడ్డు అంటూ పబ్లిక్ ఫంక్షన్లలో మాట్లాడి... ఆ తర్వాత తన వ్యాఖ్యల పట్ల హీరోయిన్లు ఏమీ అనుకోరని తను అనుకుంటున్నట్లు వివరణ ఇచ్చారు. ఐతే ఆ తర్వాత అక్కడక్కడా నిరసనలు వ్యక్తం కావడంతో నోరు మూసుకుని ఉండటం మంచిదని కూడా చెప్పుకొచ్చారు.
 
తాజాగా మళ్లీ అలీ తన నోటికి డబుల్ మీనింగ్ డైలాగులకు అడ్డుకట్ట లేనే లేదని తేల్చేసిన సంఘటన ఒకటి జరిగింది. టీవీల్లో ప్రసారమైన ఓ అవార్డుల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన అలీ డబుల్ మీనింగ్ డైలాగులు విసిరారు. అవేంటంటే.. నోట్లో ఏం పెట్టాలి..?,  ఆరడుగులుండే వారిలో ఆ మ్యాటరుండదు.., అదే కాయ కచేరీ.. అంటూ మాట్లాడేశాడు. అంతేకాదు హీరోయిన్ ఖుష్బూ ‘క్రీమ్ బిస్కెట్ లాగుంది” అని కూడా అనేశాడు. ఆ వ్యాఖ్యలను అప్పటికప్పుడు స్పందించలేక సిగ్గుతో వారు తల దించుకున్నారు కానీ.. కొందరు మాత్రం అలీ నోటి దూల ఇంకా పోలేదంటూ కామెంట్లు చేసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంతమందితో డేటింగ్ చేశానో లెక్కేలేదు.. చీట్ చేయాలని చూస్తే మాత్రం?: అంబర్ రోజ్