Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎంతమందితో డేటింగ్ చేశానో లెక్కేలేదు.. చీట్ చేయాలని చూస్తే మాత్రం?: అంబర్ రోజ్

విదేశాల్లో డేటింగ్ సర్వసాధారణం. అదీ కొందరు హాలీవుడ్ నటీమణుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. గతంలో తన మొబైల్ నెంబర్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇబ్బందులు కొని తెచ్చుకున్న రోజ్.. ఆపై న్యూడ్ స

Advertiesment
Amber rose sensational comments on dating
, సోమవారం, 29 ఆగస్టు 2016 (18:06 IST)
విదేశాల్లో డేటింగ్ సర్వసాధారణం. అదీ కొందరు హాలీవుడ్ నటీమణుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. గతంలో తన మొబైల్ నెంబర్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇబ్బందులు కొని తెచ్చుకున్న రోజ్.. ఆపై న్యూడ్ సెల్ఫీలు పోస్ట్ చేసి విమర్శల పాలైంది. తాజాగా హాలీవుడ్ నటి అంబర్ రోజ్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఓ కార్యక్రమంలో రోజ్ మాట్లాడుతూ.. పురుషులు అబద్ధాలు చెప్తున్నారని.. మహిళలు సులభంగా గుర్తిస్తారని చెప్పింది. తాను ఇంతవరకు ఎంతమందితో డేటింగ్ చేశానో లెక్కలేదని చెప్పింది. 
 
ఎవరెవరితో శృంగారంలో పాల్గొన్నానో లెక్కే లేదని.. వారిని లెక్కించి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదని అంబర్ రోజ్ తెలిపింది. మగవాళ్ళు రకరకాల అబద్దాలు చెబుతూ మహిళలను లొంగ దీసుకుంటారని.. ఆడవాళ్లను ఆకర్షించేందుకు పురుషులు పొగడ్తల ఆయుధాన్ని వాడతారని చెప్పింది. కానీ తనను చీటింగ్ చేయాలని చూస్తే, తిట్టించుకోవాల్సిందేనని తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెప్టెంబర్ 2న 'సిద్ధార్థ' ఆడియో.. ఇదే నెలలోనే చిత్రం రిలీజ్