Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యాక్షన్ గ్యాంగ్ స్టర్ పీరియడ్ డ్రామా మైఖేల్ : డైరెక్టర్ రంజిత్ జయకోడి

Ranjith Jayakodi
, శుక్రవారం, 27 జనవరి 2023 (16:42 IST)
Ranjith Jayakodi
సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రమైన ’మైఖేల్’కి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, దివ్యాంశ కౌశిక్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ ఎల్‌ పి, మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ‌ఎల్‌ పి కలిసి ఈ చిత్రాన్ని భారీ నిర్మిస్తున్నాయి. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు. ఇప్పటికే విడుదలైన మైఖేల్ టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మైఖేల్ ఫిబ్రవరి3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానున్న నేపధ్యంలో దర్శకుడు రంజిత్ జయకోడి విలేఖరులు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
 
- మాది చెన్నై. దర్శకుడిగా మూడు సినిమాలు చేశాను. నా తొలి చిత్రం విజయ్ సేతుపతి గారితో చేశాను. తర్వాత హరీష్ కళ్యాణ్ తో మరో సినిమా చేశాను. మూడో సినిమా కూడా విడుదలకు సిద్ధమౌతుంది. ‘మైఖేల్’ నా నాలుగో చిత్రం. దర్శకుడు రామ్ దగ్గర సహాయకుడిగా పని చేశాను.  ఒక సినిమాకి పని చేసిన తర్వాత దర్శకుడిగా నా ప్రయాణం మొదలుపెట్టాను.
 
- నా రెండో సినిమా చూసి సందీప్ కిషన్ కాల్ చేశారు. నా వర్క్ ఆయనకి చాలా నచ్చింది. అలా మేము మంచి స్నేహితులయ్యాం. లాక్ డౌన్ చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. సెకండ్ లాక్ డౌన్ సమయంలో ‘’మనం కలసి ఒక సినిమా చేద్దాం’’ అన్నారు. ఆయనకి అప్పటికి ఒక యాక్షన్ సినిమా చేయాలని వుంది. సరిగ్గా నేను కూడా ఆ సమయానికి యాక్షన్ స్క్రిప్ట్ రాస్తున్నాను. అలా ‘మైఖేల్’ మొదలైయింది. 
 
 - ’మైఖేల్’ మూవీ ఒక జోనర్ అని చెప్పలేం. రొమాంటిక్, యాక్షన్, గ్యాంగ్ స్టార్ డ్రామా, పిరియడ్ ఫిల్మ్ అనొచ్చు. ఇందులో 70, 80, 90 ఇలా మూడు కాలాలు వుంటాయి. ఎక్కువ భాగం 90లో వుంటుంది. కథ చాలా ఆసక్తికరంగా వుంటుంది. గ్యాంగ్ స్టార్ డ్రామా వున్న బ్యూటీఫుల్ రొమాంటిక్ లవ్ స్టొరీ ఇది.
 
- వరుణ్ సందేశ్ ని విలన్ గా చూపించాలనే ఆలోచన  కథ రాసినప్పుడు ఆ పాత్ర కోసం వేరే నటుడు నా మనసులో వున్నారు. సందీప్ కిషన్, ఆ పాత్ర వరుణ్ కొత్తగా ఉంటాడు ఒకసారి ప్రయత్నించమని చెప్పారు. సందీప్ కి లవర్ బాయ్ ఇమేజ్ వుందని నాకు తెలుసు. కాస్త సందేహంతోనే ఆయన దగ్గరకి వెళ్లి స్క్రీన్ టెస్ట్ చేస్తానని కోరాను. వరుణ్ చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు. ఒక సీన్ ఇచ్చి స్క్రీన్ టెస్ట్ చేశాను. తొలి సినిమాకి ఆడిషన్ ఇస్తున్న ఆర్టిస్ట్ కు వున్న ఎనర్జీ వరుణ్ లో కనిపించింది. ఆ పాత్రలో నన్ను చాలా సర్ ప్రైజ్ చేశారు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా సర్ ప్రైజ్ అవుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటుడు తారకరత్నకు తీవ్ర అస్వస్థత - ఆరోగ్యం విషమం???