అమీర్ ఖాన్ కూతురు ఏం చేయ‌బోతుందో తెలుసా..?

శనివారం, 24 ఆగస్టు 2019 (19:59 IST)
నటీనటుల వారసులు ఎక్కవ శాతం వెండితెరపై వెలగాలని ఆశపడుతుంటారు. కానీ కొంతమంది ఎవరూ ఊహించని దారిలో వెళుతుంటారు. అందులో అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ కూడా ఉంది. ఆమె సరికొత్త అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. 
 
ఈ మిస్టర్ పర్ఫెక్ట్ గారాలపట్టి మెగా ఫోన్ పట్టి హాలీవుడ్ సినిమాకు డైరెక్షన్ చేస్తోంది. యూరిపిడెస్ మెడియా అనే టైటిల్‌ను కూడా ఎనౌన్స్ చేశారు. థియేటర్స్ ప్రొడక్షన్స్‌లో తెరకెక్కనున్న ఈ హాలీవుడ్ మూవీ గ్రీక్‌కు సంబంధించిన ఒక ట్రాజెడీ స్టోరీ లైన్ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. 
 
ఇండియాలోని కొన్ని ప్రధానమైన నగరాలను ఇరా ఖాన్ తన ప్రాజెక్టులో హైలెట్ చేసి చూపించనుంది. ఇక వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసి డిసెంబర్ నెలలో ఈ ప్రాజెక్ట్‌ని రిలీజ్ చేయాలని ఇరా ప్రయత్నాలు చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం సెన్సార్ నుండి యు/ఏ సర్టిఫికెట్ పొందిన ‘సాహో’... ఇంత‌కీ సెన్సార్ రిపోర్ట్ ఏంటి..?