Rajiv Salur, Varsha Vishwanath
కోటి తనయుడు రాజీవ్ సాలూర్ హీరోగా, వర్ష విశ్వనాథ్ హీరోయిన్‌గా రాబోతున్న డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ 11: 11. టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెంబర్ 1గా కిట్టు నల్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సదన్, సీనియర్ హీరో రోహిత్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో తాజాగా స్టార్ హీరో దగ్గుబాటి రానా 11: 11 మోషన్ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేసిన ఈ వీడియో సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఒక నిమిషం రెండు సెకనుల నిడివితో కట్ చేసిన ఈ మోషన్ కాన్సెప్ట్ పోస్టర్‌లో కేవలం మూడు క్యారెక్టర్స్ చూపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచారు. హీరో రాజీవ్ సాలూర్- హీరోయిన్ వర్ష విశ్వనాథ్ మధ్య లవ్ ట్రాక్, అందులో అనూహ్యంగా ఎంటరైన ఓ వ్యక్తి, అతన్ని హతమార్చడం లాంటి సీన్స్ ఈ వీడియోలో కనిపించాయి. ఆసక్తి రేకెత్తిస్తున్న థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌కి తోడు మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఈశ్వర్ సినిమాటోగ్రఫీ ఈ వీడియోలో హైలైట్ అయ్యాయి.
గతంలో ఈ 11: 11 చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసి చిత్రయూనిట్ మొత్తానికి బెస్ట్ విషెస్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇప్పుడు మోషన్ పోస్టర్ విషయంలో రానా సపోర్ట్ దొరికింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించాలని రానా కోరుకున్నారు. అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్, ఇతర అప్‌డేట్స్ ప్రకటించనున్నారు మేకర్స్.
నటీనటులు :
రాజీవ్ సాలూర్, వర్ష విశ్వనాథ్, రోహిత్, కోటి సాలూర్, సదన్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ తదితరులు
సాంకేతిక వర్గం
బ్యానర్: టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తికా ఫిలిమ్స్
సినిమాటోగ్రఫీ: ఈశ్వర్
ఎడిటర్: రవి మాన్ల
డైలాగ్స్: పవన్ కె అచల
మ్యూజిక్ : మణిశర్మ
ప్రొడ్యూసర్: గాజుల వీరేష్ (బళ్లారి)
లైన్ ప్రొడ్యూసర్: సందీప్ గాలి
స్టోరీ-స్క్రీన్ ప్లే- డైరెక్షన్: కిట్టు నల్లూరి