Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మే 27న అమెజాన్ ప్రైమ్ లో ‘ఏక్ మినీ కథ`

Advertiesment
మే 27న అమెజాన్ ప్రైమ్ లో ‘ఏక్ మినీ కథ`
, గురువారం, 20 మే 2021 (19:41 IST)
Santosh Sobhan, Kavya Thapar
బయట పరిస్థితులు అస్సలు బాగోలేవు. అందుకే సినిమాలు కూడా విడుదల చేయడం లేదు. ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ మాకు ముఖ్యం కాదు. అందుకే మా సినిమాను వాయిదా వేస్తున్నాం అంటూ ఈమధ్య అధికారికంగా ప్రకటించారు ఏక్ మినీ కథ చిత్ర యూనిట్. ఇప్పుడు ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 27న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రిలీజ్ పోస్టర్ కూడా విడుదల చేశారు. కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ వరుస విజయాలు అందుకుంటున్న నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్. దీనికి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మొదలు పెట్టారు. ఈ బ్యాన‌ర్ లోనే ఏక్ మినీ కథ సినిమా నిర్మాణం పూర్తైంది. 
 
ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్, పాటలకు మంచి ఆద‌ర‌ణ‌ వస్తుంది. ముఖ్యంగా Does Size Matter అంటూ పోస్టర్ లో ఉన్న మ్యాటర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పేపర్ బాయ్ సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్  రాజా లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. కార్తీక్ రాపోలు ఏక్ మినీ కథ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. అందరూ ఇంట్లోనే సేఫ్‌గా ఉంటూ తమ సినిమా చూడాలని కోరారు ఏక్ మినీ కథ యూనిట్.
 
నటీనటులు: సంతోష్ శోభన్, కావ్య తప్పర్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు..
 
టెక్నికల్ టీమ్:
దర్శకుడు: కార్తీక్ రాపోలు
నిర్మాణ సంస్థ: యూవీ కాన్సెప్ట్స్
ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్
కథ: మేర్లపాక గాంధీ
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి
ఎడిటర్: సత్య

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వకీల్ సాబ్‌ అయ్యింది.. ఇక లెక్చరర్ పాత్రలో పవన్ కల్యాణ్