Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెచ్యూర్‌ అయిన సమంత!

మెచ్యూర్‌ అయిన సమంత!
, బుధవారం, 9 మే 2012 (10:59 IST)
'ఏమాయ చేసావె' చిత్రంలో సమంతకు పెద్దగా నటన తెలీదు. గౌతమ్‌ వాసుదేవమీనన్‌ ఆమెకు ఓనామాలు నేర్పించి ఒక రూపానికి తెచ్చారు. ఆ చిత్రం వందరోజులు ఆడింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో సమంత బిజీ అయింది. మళ్ళీ గౌతమ్‌మీనన్‌తో తాజాగా 'ఎటో వెళ్ళిపోయింది మనసు' అనే చిత్రంలో నటించింది. ఇందులో నాని కథానాయకుడు. తెలుగు తమిళభాషల్లో రూపొందుతోంది. తమిళంలో జీవా హీరో. తెలుగులో సి.కళ్యాణ్‌ నిర్మాత.

ఈ చిత్రం కర్టెన్‌రైజర్‌గా సోమవారం రాత్రి హైదరాబాద్‌లో చిత్ర యూనిట్‌ పాల్గొంది. ఏమాయ చేసావెలో చీరకట్టుకుని వచ్చిన సమంత ఈ చిత్రం కోసం ఎక్స్‌పోజ్‌ ప్రదర్శించింది. దర్శకుడు సమంతానుద్దేశించి మాట్లాడుతూ... సమంతలో మొదటి చిత్రానికి ఇప్పటికి చాలా మెచ్చూరిటీ కన్పించింది. షాట్‌ చెప్పగానే అల్లుకుపోతుంది. నాని సీరియస్ ఏక్టర్‌గా మంచి పెర్‌ఫార్మెన్స్‌ ప్రదర్శించాడు. అని చెప్పారు.

నాని మాట్లాడుతూ.. ఇళయారాజా మ్యూజిక్‌ అంటే ప్రాణం. ఆయన నా చిత్రానికి సంగీతం వహించడం అదృష్టంగా భావిస్తున్నాను. త్వరలో ఆడియోను, వచ్చేనెలలోసినిమాను విడుదల చేస్తాం అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu