The Paradise Update poster
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ది ప్యారడైజ్. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. రేపు - ఉదయం 10:08 & సాయంత్రం 5:04 కు తాజా అప్ డేట్ చేయనున్నట్లు చిత్ర టీమ్ ప్రకటించింది. ఇక సినిమాను 26 మార్చి 2026న విడుదల కాబోతుంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ మరియు స్పానిష్ భాషలలో విడుదలవుతోంది.
దసరా తర్వాత నాని-శ్రీకాంత్ ఓదెల మరోసారి కలిసి చేస్తున్న ఈ సినిమా, హైదరాబాద్-సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా రాబోతోంది. ఈ చిత్రంలో రాఘవ జూయాల్ ఒక కీలక పాత్రలో కనిపించనుండగా, రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని సి. సాయి, ఎడిటింగ్ నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైన్ అవినాష్ కొల్లా చేస్తున్నారు.
కాగా, సమాచారం మేరకు ఈ సినిమాలో మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కూడా జరుగుతోంది. బహుశా మోహన్ బాబు పాత్రకి సంబంధించిన అప్ డేట్ రాబోతోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.