Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎఫ్ 3 తర్వాత సంక్రాంతికి వస్తున్నాం అంటున్న అనిల్ రావిపూడికి బ్రేక్ పడుతుందా?

Advertiesment
Anil Ravipudi

డీవీ

, సోమవారం, 14 అక్టోబరు 2024 (15:43 IST)
Anil Ravipudi
అనిల్ రావిపూడి ఎఫ్.3 తర్వాత మరో సినిమా చేస్తున్నాడు. వెంకటేష్ కాంబినేషన్ లో చేస్తున్న ఈ సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ను పెట్టారు కానీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి వుంది. ప్రస్తుతం షూటింగ్ అన్నపూర్ణ ఏడెకరాలసెట్లో చిత్రీకరణ జరుగుతుంది. ఆ పక్కనే విశ్వంభరలో ఓ సాంగ్ ను కూడా చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే చిరంజీవి సెట్లోకి వెళ్ళి వెంకటేష్ పలుకరించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి.
 
కాగా, సంక్రాంతికి ఫుల్ వినోదంతో వెంకటేస్, అనిల్ రావిపూడి సినిమా రాావాలని అనుకుంటుండగా, షడెన్ గా రామ్ చరన్ సినిమా గేమ్ ఛేంజర్ వస్తున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. సంక్రాంతి బరిలో ముందునుంచీ నేనున్నానంటూ చిరంజీవి కూడా ప్రకటించాడు. కానీ గేమ్ ఛేంజర్ లో కొన్ని మార్పులు వల్ల డిసెంబర్ లో రావాల్సిన సినిమా జనవరికి వెళ్ళినట్లు దిల్ రాజు ప్రకటించారు. అయితే ఈ ప్రకటన సినిప్రియులకు ఆశ్చర్యానికి గురిచేసినా అనిల్ రావిపూడికి మరింత షాక్ ను ఇచ్చింది. దాంతో తాము సంక్రాంతికి అనుకుంటున్న సినిమా వస్తుందో లేదో అని టెన్షన్ తో వుండడంతో దిల్ రాజు వచ్చి సర్దిచెప్పినట్లు తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి దిల్ రాజు మార్కెట్ ఎనాలసిస్ తో ఎన్ని సినిమా వాయిదాలు పడతాయో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మట్కాలో లేలేలే రాజా అంటూ యూత్ హృదయాలను దోచుకోనున్న నోరాఫతేహి