Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జానీ మాస్టర్ కేసులో విశ్వక్సేన్ పేరు.. ఆ అమ్మాయి నచ్చకే ఇదంతా.. ఎవరు?

Advertiesment
Vishvak Sen

సెల్వి

, సోమవారం, 23 సెప్టెంబరు 2024 (11:45 IST)
జానీ మాస్టర్ కేసు హీరో విశ్వక్సేన్ పేరు వినిపిస్తుంది. విశ్వక్ సేన్ సినిమా నుంచే జానీ మాస్టర్‌కు, బాధితురాలికి మధ్య అభిప్రాయబేధాలొచ్చాయని అంటున్నారు. ఎప్పట్లాగానే విశ్వక్ సేన్ సినిమా సాంగ్ షూటింగ్‌కు కొరియోగ్రాఫీ చేసేందుకు బాధితురాలు వచ్చిందని.. షెడ్యూల్ ప్రకారం ఆరోజు 30 నుంచి 35 షాట్స్ తీయాల్సి ఉంది. కానీ బాధితురాలు మాత్రం తన కొరియోగ్రాఫీలో కేవలం 7 షాట్స్ మాత్రమే తీసిందంట.
 
దీంతో విశ్వక్‌తో పాటు, నిర్మాత కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఆ వెంటనే ఆమెను తీసేసి, మరుసటి రోజు నుంచి మరో మాస్టర్‌ను తెచ్చుకున్నారట. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆరోజు బాధితురాలు అన్ని తక్కువ షాట్స్ తీయడానికి కారణం జానీ మాస్టర్ అంట. పనిలో ఉన్నప్పుడు జానీ మాస్టర్, బాధితురాల్ని చాలా ఇబ్బంది పెట్టాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. బాధితురాలు పనిపై దృష్టి పెట్టకపోవడానికి జానీ మాస్టరే కారణమని తెలుస్తోంది. అయితే ఈ టాక్‌ను జానీ మాస్టర్ భార్య సుమలత ఖండిస్తున్నారు.
 
"ఆ అమ్మాయి వర్క్ నచ్చక విశ్వక్ సినిమా నుంచి పంపించేశారు. వర్క్ నచ్చనప్పుడు లక్షల్లో నష్టం వస్తుంది కదా, అందుకే వెంటనే తీసేసి మరో డాన్స్ మాస్టర్‌ను తెచ్చుకున్నారు. ఈ వ్యవహారానికి జానీ మాస్టర్ కు ఎలాంటి సంబంధం లేదు. 
 
ఆ అమ్మాయి ఏ పాట చేయకపోయినా దానికి జానీ మాస్టర్ ఎలా కారణం అవుతారు. ఆ అమ్మాయిని ఎవ్వరూ ఆపలేదు. ఆమెకు అసోసియేషన్ కార్డు కూడా మేమే ఇప్పించాం. మేమెందుకు ఆమె కెరీర్‌ను ఆపుతాం." అని సుమలత అన్నారు. ఇకపోతే గోవాలో అరెస్టయిన జానీ మాస్టర్ ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. అతడికి కోర్టు 2 వారాల రిమాండ్ విధించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ అందరూ గర్వపడేలా కష్టపడతా : నటి జాన్వీ క‌పూర్