Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15-20 చపాతీలు.. 25-30 ఇడ్లీలు లాగించగలను : ఇరుముగన్ విక్రమ్

చిన్నపుడు డబ్బుల్లేక కడుపు నిండా తినలేకపోయా.. ఆ తర్వాత నటుడిగా ఫిజిక్ మెయింటైన్ చేయడం కోసం కడుపు మాడ్చుకున్నా.. వయసు మీద పడ్డాక అనారోగ్యంతో తినలేకపోతున్నా.. అంటూ అప్పట్లో ఓసారి దివంగత నటుడు అక్కినేని

Advertiesment
Vikram
, సోమవారం, 26 సెప్టెంబరు 2016 (15:19 IST)
చిన్నపుడు డబ్బుల్లేక కడుపు నిండా తినలేకపోయా.. ఆ తర్వాత నటుడిగా ఫిజిక్ మెయింటైన్ చేయడం కోసం కడుపు మాడ్చుకున్నా.. వయసు మీద పడ్డాక అనారోగ్యంతో తినలేకపోతున్నా.. అంటూ అప్పట్లో ఓసారి దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు చెప్పిన సంగతి విదితమే. ఆ విషయానికొస్తే.. నటదిగ్గజం నాగేశ్వరరావు మాత్రమే కాదు చాలామంది నటీనటులు సినిమాల కోసం, బాడీ షేపులకోసం కడుపు మాడ్చుకుంటున్నారు. అందులోనూ పాత్రల కోసం ప్రాణం పెట్టేసే విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 
 
కోలీవుడ్‌లో యంగ్ హీరోలకు ధీటుగా పోటీపడీ నటిస్తుంటాడు. కొత్తగా ఏదైనా ప్రయోగం చేయాలంటే అందరికంటే ముందుటాడు ఈ హీరో. గతంలో ఆయన నటించిన ''అపరిచితుడు'', ''ఐ'' సినిమాల్లో ఆడియెన్స్ విక్రమ్ గెటప్స్‌కు ఫిదా అయిపోయారు. సినిమా సినిమాకూ డిఫరెంట్ లుక్ చూపించే విక్రమ్.. కడుపు నిండా తిని చాలా ఏళ్లయిందట. స్వతహాగా తాను భోజన ప్రియుడినని.. బాగా తినేవాడినని.. ఐతే సినిమాల కోసం తక్కువ తినడం అలవాటై.. ఇప్పుడు ఎక్కువ తిన్నా పడని స్థాయికి చేరుకున్నానని విక్రమ్ ఓ ఇంటర్వ్వూలో చెప్పాడు.
 
 ''నేను అవలీలగా 15-20 చపాతీలు తినగలను. 25-30 ఇడ్లీలు లాగించగలను. కానీ గడచిన పదీ పదిహేనేళ్లల్లో నా తిండి పూర్తిగా తగ్గిపోయింది. దాంతో ఒకప్పటిలా ఇప్పుడు తింటే సరిపడటం లేదు. మామూలుగా ఒక్క గులాబ్ జాం.. ఒక ఐస్ క్రీం వల్ల ఎవరూ లావైపోరు. కానీ నేను సినిమాల కోసం కఠినమైన డైటింగ్ చేయడం వల్ల ఒక్క గులాబ్ జాం తిన్నా బరువు పెరిగిపోతాను. ఎంత తక్కువ తిన్నా అది ఎక్కువైపోతోంది. అందుకే నేను ఎప్పటికీ ఒకప్పట్లా 20 చపాతీలు.. 30 ఇడ్లీలు తినలేనేమో'' అని వాపోయాడు విక్రమ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను...శైల‌జ‌! కీర్తి సురేష్ పైన స్టార్ హీరోల మోజు