నేను...శైలజ! కీర్తి సురేష్ పైన స్టార్ హీరోల మోజు
ఎక్కువ మూమెంట్... ఎక్కువ ఫీలింగ్స్ ఇవ్వకుండా ... హుందాగా ఒక చిరునవ్వు నవ్వి... నేను శైలజ తెలుగు సినీ మార్కెట్లో తన ఎంట్రీ ఇచ్చింది. ఇపుడు ఆ శైలజనే కావాలని స్టార్ హీరోలు సైతం పట్టుబట్టే స్థాయికి చేరింది. ఆమె ఎవరో కాదండీ... శైలజా శైలాజా అం
ఎక్కువ మూమెంట్... ఎక్కువ ఫీలింగ్స్ ఇవ్వకుండా ... హుందాగా ఒక చిరునవ్వు నవ్వి... నేను శైలజ తెలుగు సినీ మార్కెట్లో తన ఎంట్రీ ఇచ్చింది. ఇపుడు ఆ శైలజనే కావాలని స్టార్ హీరోలు సైతం పట్టుబట్టే స్థాయికి చేరింది. ఆమె ఎవరో కాదండీ... శైలజా శైలాజా అంటూ రామ్ వెంటపడిన తమిళ భామ కీర్తీ సురేష్. ఆ సినిమా హిట్ కావడంతో, ఇపుడు తెలుగు మార్కెట్లోనూ కీర్తికి గిరాకీ పెరిగింది.
తాజాగా హ్యాట్రిక్ స్టార్ హీరోగా మారిన అల్లు అర్జున్ స్టూడియో గ్రీన్ ప్రాజెక్ట్ లోకి కీర్తి ఎంటర్ అయింది. ఈ ప్రాజెక్టులో హీరోయిన్స్ కోసం చాలామందిని ట్రై చేశారట. ఎట్టకేలకు ఈ తమిళ భామకే బన్నీ ఓటు వేశాడట. ఇప్పటికే మాలీవుడ్, కోలీవుడ్‌లలో మంచి మార్కెట్ ఏర్పరుచుకున్న బన్నీ కీర్తితో అయితే, రెండు భాషల్లోనూ సినిమాకు ప్లస్ అవుతుందని అంటున్నాడట. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చెయ్యలేదు. కానీ, బన్నీ మాత్రం కీర్తి ముక్తసరి నవ్వుకు ఫ్లాట్ అయిపోయాడంటున్నారు.