Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా భర్తతో విడిపోయానా.. మేం ఇద్దరం బాగున్నాం.. మేం అందరి భార్యాభర్తల్లా కాదు: విద్యాబాలన్

బాలీవుడ్ తార విద్యాబాలన్ తన భర్తతో విడిపోయిందనే వార్తలు వచ్చాయి. భార్యాభర్తలు విడిపోవడం, విడాకాలు తీసుకోవడం, బ్రేకప్‌లు కావడం వంటివి బిటౌన్లో సర్వసాధారణమైపోయాయి. తాజాగా సెలబ్రెటీ దంపతులు విడివిడిగా కన

Advertiesment
Vidya Balan responds to rumours surrounding her marriage
, సోమవారం, 14 నవంబరు 2016 (11:29 IST)
బాలీవుడ్ తార విద్యాబాలన్ తన భర్తతో విడిపోయిందనే వార్తలు వచ్చాయి. భార్యాభర్తలు విడిపోవడం, విడాకాలు తీసుకోవడం, బ్రేకప్‌లు కావడం వంటివి బిటౌన్లో సర్వసాధారణమైపోయాయి. తాజాగా సెలబ్రెటీ దంపతులు విడివిడిగా కనిపిస్తే విడిపోయారేమోనని బీటౌన్‌లో సందేహాలు తలెత్తుతున్నాయి. ఇలా విద్యాబాలన్ తన భర్తకు దూరమైందని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలపై విద్యాబాలన్ ఘాటుగా స్పందించింది. 
 
తన దాంపత్య జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేస్తూ ఇలాంటి పుకార్లు పుట్టించే వారిపై ఘాటుగా స్పందించింది. విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్న విద్యాబాలన్‌ 2012లో నిర్మాత సిద్ధార్థ్‌రాయ్‌ కపూర్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళికి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. కానీ ఇటీవల వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని.. విడిపోయే అవకాశాలున్నాయంటూ పుకార్లు వచ్చాయి.
 
దీనికి విద్యాబాలన్‌ సమాధానమిస్తూ.. 'మేం అందరి భార్యాభర్తల్లా కాదు. సెల్ఫీలు దిగి ట్విట్టర్‌లో షేర్‌ చేయడం.. ఎప్పుడూ చేతుల్లో చేయి వేసి నడవడం లాంటి పనులు చేయమని తెలిపింది. బహుశా అందుకే మా దాంపత్య జీవితం సరిగా లేదని పుకార్లు పుట్టిస్తున్నారు. 
 
పార్టీలకు, ఫంక్షన్లకు ఇద్దరు కలిసి ఎందుకు రారని మమ్మల్ని చాలామంది అడుగుతుంటారు. నా భర్తతో పని చేసేవాళ్లు నాకు పరిచయం లేనప్పుడు ఆయన వెళ్లే కార్యక్రమానికి నేను ఎలా వెళ్లగలను? మేం ఇద్దరం బాగున్నాం. వచ్చే నెలలో మా వివాహబంధానికి నాలుగేళ్లు పూర్తవుతాయి. మా మధ్య సఖ్యత ఉన్నంత కాలం ఇలాంటి అవాస్తవ పుకార్లకు స్పందించాల్సిన అవసరం లేదు' అని విద్యాబాలన్ ఫైర్ అయ్యింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మడి ఘాటు అందాలు చూసి తట్టుకోలేకపోయిన సెన్సార్ బోర్డు!