నాలుగు పదుల వయసులో ట్యూషన్‌కు వెళుతున్న టాలీవుడ్ హీరో ఎవరు?
దగ్గుబాటి వంశోద్ధారకుడు విక్టరీ వెంకటేశ్ ట్యూషన్‌కి వెళ్తున్నాడు. పట్టభద్రుడైన ఆయన ట్యూషన్ కెళ్లటం ఏంటీ అనుకుంటున్నారా? అవును వెంకటేష్ ట్యూషన్‌కి వెళుతున్నారు. అయితే ఇది చదువుకు సంబంధించిన ట్యూషన్ కాద
దగ్గుబాటి వంశోద్ధారకుడు విక్టరీ వెంకటేశ్ ట్యూషన్‌కి వెళ్తున్నాడు. పట్టభద్రుడైన ఆయన ట్యూషన్ కెళ్లటం ఏంటీ అనుకుంటున్నారా? అవును వెంకటేష్ ట్యూషన్‌కి వెళుతున్నారు. అయితే ఇది చదువుకు సంబంధించిన ట్యూషన్ కాదండోయ్. బాక్సింగ్ లెసన్స్ నేర్పించే ట్యూషన్. అసలు కారణమేంటంటే... తమిళ - హిందీ భాషల్లో బాక్సాఫీసు బద్దలు కొట్టిన చిత్రం ''సాలా ఖడూస్'' రీమేక్‌లో వెంకీ నటించబోతున్నాడు.
ఈ చిత్రం పూర్తిగా ఓ బాక్సింగ్ కోచ్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో వెంకీ సరసన రితికా సింగ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా కోసమని విక్టరీ బాక్సింగ్ నేర్చుకునే పనిలో నిమగ్నమైయున్నాడు. ఓ పక్క వర్కౌట్లు చేస్తూనే.. ఇంకో పక్క బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఓ బాక్సింగ్ ట్రైనర్ దగ్గర మెలకువలు నేర్చుకుంటున్నాడు. సుధా కొంగరానే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.