మహేష్ బాబు చిత్రంలో గెస్ట్ రోల్‌లో నమ్రతా శిరోద్కర్!
''బ్రహ్మోత్సవం'' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ
''బ్రహ్మోత్సవం'' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.
ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు ఎస్.జే.సూర్య నెగెటివ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈయనకు జోడిగా నదియా నటిస్తుంది. మహేష్, మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది.
కాగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కూడా ఈ సినిమాలో నటిస్తోందట. ఆమె ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలు నటించలేదు. ఇప్పుడు మళ్లీ నమ్రత సినిమాల్లో నటిస్తుందనే వార్తలు రావడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొంతకాలం వేచియుండాల్సిందే.