Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాకు అదంటే చాలా చాలా ఇష్టమంటున్న హీరోయిన్?

రాశీఖన్నా. పెద్దగా సినిమాలు చేయకపోయినా యువతరం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న హీరోయిన్. కొన్నిరోజుల్లోనే తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. అందరితో కలివిడిగా ఉంటూ కలిసిపోవడం రాశీఖన్

Advertiesment
నాకు అదంటే చాలా చాలా ఇష్టమంటున్న హీరోయిన్?
, గురువారం, 15 జూన్ 2017 (12:42 IST)
రాశీఖన్నా. పెద్దగా సినిమాలు చేయకపోయినా యువతరం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న హీరోయిన్. కొన్నిరోజుల్లోనే తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. అందరితో కలివిడిగా ఉంటూ కలిసిపోవడం రాశీఖన్నాకు అలవాటని సినీవర్గాలే చెబుతుంటాయి. ఎప్పుడూ దర్శక, నిర్మాతలను ఇబ్బందులు పెట్టడం రాశీఖన్నా చేయదన్నది ఆమెపై తెలుగు చిత్ర సీమల్లో ఉన్న మంచి అభిప్రాయం. ఎంత పారితోషికం ఇస్తే అంతేతీసుకుంటుంది. కానీ ఆమెకు ఇష్టమైంది మాత్రం ఒకటే. తనకు నచ్చిన సినిమాలు విజయవంతం కావడమే. సినిమా విజయవంతమైతే చాలట. తాను నటించడానికి పెద్దగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదంటోంది రాశీఖన్నా.
 
రాశీఖన్నా గతంలో కొత్త హీరోలతో, ఆ తర్వాత సీనియర్ హీరోలతో నటించి పెద్దగా సినిమాలు లేక సైలెంట్‌గా ఉండిపోయారు. కానీ ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్‌టిఆర్, రవితేజలతో కలిసి నటించే అవకాశం మళ్ళీ వచ్చింది. ఇక తన టాలెంట్ ఏందో నిరూపించుకునేందుకు సిద్ధమైంది రాశీఖన్నా. అన్ని సినిమాల్లో నటించడం కన్నా తాను నటించిన సినిమా విజయవంతమైతే తనకు దానికి మించిన సంతోషం లేదంటోందంట రాశీఖన్నా. 
 
సినిమా ఘూటింగ్ నడిచే సమయంలో ఇదే విషయాన్ని అందరితో షేర్ చేసుకుంటూ ఉంటుందట. సినిమా హిట్ అవ్వడమే తనకు చాలా చాలా ఇష్టమని. హిట్టయిన సినిమాలో తాను నటించానన్న సంతృప్తి చాలంటోంది ఈ భామ. మరి ఇలాంటి హీరోయిన్ తెలుగు చిత్రసీమలో ఉండడం మాత్రం గొప్పతనమే అంటున్నాయి తెలుగు సినీవర్గాలు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను అలా వస్తా.. మీకు ఓకేగా... అత్తపాత్రలో మరో సీనియర్ నటి