తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లతో పోటీ పడుతున్న అనసూయ భరద్వాజ్ బుల్లితెర నుంచి తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన అనసూయ.. 2021లో అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలో నటించి అభిమానులను ఆకట్టుకుంది.
కొద్ది రోజుల క్రితం తమిళంలో మైఖేల్ చిత్రంలో నటించి కోలీవుడ్ ప్రేక్షకులను కూడా ఇట్టే కట్టిపడేసింది. ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తోంది. మరోవైపు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న అనసూయ.. ఇప్పుడు సమ్మర్ వెకేషన్‌కు భర్త, పిల్లలతో కలిసి థాయ్‌లాండ్ వెళ్లింది.
అక్కడ బికినీలో విహరిస్తున్న ఫోటోలను నెట్టింట పోస్టు చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తెల్లటి బికినీలో ఒక ఫోటోను పోస్ట్ చేసిన అనసూయ, తన భర్తపై ప్రేమకు వ్యక్తీకరణగా లిప్-టు-లిప్ కిస్ ఇస్తున్న ఫోటోను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్‌ను కుదిపేస్తున్నాయి.