Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బన్నీకి షాక్ ఇచ్చిన సుకుమార్, ఏం చేశారు?

బన్నీకి షాక్ ఇచ్చిన సుకుమార్, ఏం చేశారు?
, బుధవారం, 11 మార్చి 2020 (19:40 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్‌గా అల.. వైకుంఠపురములో సినిమాతో సంచలన విజయం సాధించి సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన విజయోత్సాహంతో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో సినిమా చేస్తున్నారు. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఆర్య, ఆర్య 2 సినిమాలు రావడం.. ఆ రెండు సినిమాలు విజయం సాధించడంతో మూడవ సినిమాగా రానున్న తాజా చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 
 
ఈ భారీ క్రేజీ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అల.. వైకుంఠపురములో సినిమా షూటింగ్‌లో ఉండగానే... సుకుమార్ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసారు.
 
ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. సెకండ్ షెడ్యూల్‌ను మార్చి 15 నుంచి కేరళలో స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే... ఫస్ట్ షెడ్యూల్లో బన్నీ లేకుండా కొన్ని సీన్స్ చిత్రీకరించారు. ఇప్పుడు ఆ సీన్స్ సరిగా రాకపోవడంతో తీసేసారని.. ఈ విషయం తెలిసి బన్నీ ఆలోచనలో పడ్డారని... మళ్లీ ఫ్రెష్‌గా షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
మరోవైపు బన్నీ లేకుండా తీసిన సీన్స్ సినిమా కోసం కాకుండా.. ట్రైయిల్ షూట్ చేసారని.. అడవుల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఆ సీన్స్ తెర పైన ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు తీసారనేది మరో వార్త. 
 
ఏది ఏమైనా ఈ సినిమా మాత్రం అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను క్యూరియాసిటీని పెంచుతుందని చెప్పచ్చు. అల.. వైకుంఠపురములో సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావడంతో బన్నీ, సుకుమార్ చాలా కేర్ తీసుకుని వర్క్ చేస్తున్నట్టు సమాచారం. 
 
సుకుమార్ మాత్రం ప్రేక్షకాభిమానులు ఎన్ని అంచనాలతో వచ్చినా.. సినిమా ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచదు. ఆవిధంగా కథ, కథనంలో వైవిధ్యం ఉంటుంది. ప్రేక్షకులకు రెగ్యులర్ సినిమా కాకుండా ఓ కొత్త కథతో సినిమా చూసామనే ఫీలింగ్ కలిగిస్తుందని సుకుమార్ చెబుతున్నారు. ఇక రిలీజ్ విషయానికి వస్తే.. ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూజా రామచంద్రన్ అలాంటి ఫోటోతో సెన్సేషన్, కోలీవుడ్ కెవ్వు కేక