Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్లు అర్జున్ గురించి బాలీవుడ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు

Advertiesment
అల్లు అర్జున్ గురించి బాలీవుడ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు
, శుక్రవారం, 6 మార్చి 2020 (21:01 IST)
బుట్టబొమ్మ
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. డ్యాన్స్ ఎలా చేస్తాడో.. ఆయన డ్యాన్స్‌కి ఎంతమంది అభిమానులు ఉన్నారో అందరికీ తెలిసిందే. బన్నీ సినిమాని ప్రత్యేకించి ఆయన డ్యాన్సుల కోసం చూసే వాళ్లు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమాలో అల్లు అర్జున్ గెస్ట్ రోల్‌లో కనిపిస్తారు. ఆ సినిమాలో బన్నీ చేసిన డ్యాన్స్ చూసి భవిష్యత్‌లో హీరోగా, మంచి డ్యాన్సర్‌గా పేరు సంపాదిస్తాడు అనిపించుకున్నాడు. 
 
అనుకున్నట్టుగానే... బన్నీ డ్యాన్స్ అదరగొట్టేస్తున్నాడు. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మిగిలిన హీరోలు సైతం బన్నీ డ్యాన్స్ గురించి మాట్లాడుతుంటారంటే.. బన్నీ డ్యాన్స్ విషయంలో ఎంత కేర్ తీసుకుంటారో ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తారో అర్ధం చేసుకోవచ్చు.
 
 అసలు విషయానికి వస్తే... బన్నీ డ్యాన్స్‌కి బాలీవుడ్ స్టార్ హీరో ఫిదా అయ్యారు. ఇంతకీ ఎవరా బాలీవుడ్ స్టార్ అంటారా..? హృతిక్ రోషన్. అవును.. టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ డ్యాన్స్ గురించి.. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కామెంట్ చేయడం విశేషం. ఇంతకీ విషయం ఏంటంటే.. ఓ కార్యక్రమంలో భాగంగా హృతిక్ రోషన్ చెన్నై వచ్చారు. అక్కడ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...  బిజీగా ఉండ‌టం వ‌ల్ల ఇటీవ‌ల విడుద‌లైన సౌత్ సినిమాల‌ను చూడ‌లేక‌పోయాను. కానీ ఇక్క‌డ సినిమాల్లో ఉప‌యోగించే టెక్నాల‌జీకి నేను పెద్ద అభిమానిని. 
 
ఇక్క‌డి నుండి ఆ విష‌యాన్ని నేర్చుకోవాలి అని చెప్పారు. తనకు క‌థ న‌చ్చితే 30 సెక‌న్ల కంటే ఎక్కువ‌గా ఆలోచించ‌ను. మ‌న‌సు, ఆత్మ ఏం చెబుతుందో దాన్ని బ‌ట్టే సినిమాలు చేస్తాను. ఇప్ప‌టివ‌ర‌కు చేసిన సినిమాల‌న్నీ అలాగే చేశాను అన్నారు. ఇక డ్యాన్స్ గురించి మాట్లాడుతూ... డ్యాన్స్ బాగా చేయాలంటే దానికి ఎంతో సాధన అవసరం. డ్యాన్స్‌ని ఆస్వాదిస్తూ చేయాలి. భావాల్ని డ్యాన్స్‌తో పలికించాలి. 
 
డ్యాన్స్‌ను ఎంజాయ్ చేస్తూ చేస్తే ఆ భావాలు ముఖంలో కనపడతాయి. అప్పుడు ఆ డ్యాన్స్ చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది అన్నారు. ఇక అల్లు అర్జున్ డ్యాన్స్ గురించి అడుగగా... ఆయన డ్యాన్స్ చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది అన్నారు.
 
అంతేకాకుండా... చాలా ఇన్‌స్పైర్ చేసేలా ఉంటుందని బన్నీ డ్యాన్స్ గురించి హృతిరోషన్ కామెంట్ చేయడం విశేషం. కోలీవుడ్‌లో విజయ్ డ్యాన్స్ కూడా బాగుంటుంది. నాకు తెలిసి వీళ్లు రహస్యంగా ఏదో తింటున్నారు. డ్యాన్స్ చేసే ముందు ఏం తింటారో తెలుసుకోవాలి అన్నారు. 
 
ఇటీవల అల.. వైకుంఠపురములో రాములో రాములో పాటలో ఎంత బాగా డ్యాన్స్ చేసారో తెలిసిందే. ఇలా తను నటించే ప్రతి సినిమాలో ఏదో ఒక పాటలో అదిరిపోయే డ్యాన్స్ వేసి అదరగొట్టేస్తుంటాడు బన్నీ. అందుకనే ప్రత్యేకించి డ్యాన్స్ కోసమే ఆయన సినిమాలు చూసేవాళ్లు ఉన్నారని చెప్పచ్చు. 
 
ప్రస్తుతం బన్నీ సుకుమార్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ కేరళలో ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. సుకుమార్ డైరెక్షన్లో రూపొందిన ఆర్య, ఆర్య2 సినిమాల్లో ఎలాంటి డ్యాన్స్ చూపించాడో తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేస్తున్న మూడవ సినిమా. కాబట్టి ఈ సినిమాలో కూడా బన్నీ అదిరిపోయే.. స్టెప్పులతో ఆకట్టుకుంటాడని ఆశిద్దాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైతు లవ్ స్టోరీ డేట్ వచ్చేసింది కానీ కరోనా దెబ్బకి వెనక్కి వెళ్లింది