ఈ సంవత్సరం శ్రీలీల కాస్త కష్టాలను ఎదుర్కొంది. ఆమె రాబిన్‌హుడ్, జూనియర్, మాస్ జాతర చిత్రాల్లో కనిపించింది, కానీ వాటిలో ఏవీ ప్రేక్షకులను మెప్పించలేదు. తాజాగా శ్రీలీల కొత్త బీచ్ ఫోటోలు ఆన్‌లైన్‌లో కొత్త సంచలనాన్ని సృష్టించాయి. ఆమె గోవాలో బీచ్ రాళ్లపై నిలబడి, ముదురు ఆకుపచ్చ చీరలో అందంగా కనిపించింది. ప్రస్తుతం శ్రీలీల తమిళ చిత్రం పరాశక్తిలో నటిస్తోంది. రెండు పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి.
ఇకపోతే.. రవితేజ, శ్రీలీల క్రేజీ కాంబినేషన్‌లో ఇటీవల థియేటర్లకు వచ్చి ప్రేక్షకులను నిరాశపర్చిన చిత్రం మాస్ జాతర. ఇప్పుడు డిజిట్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మించిన ఈ సినిమాతో సామజవరగమన ఫేం డైలాగ్ రైటర్ భాను భోగవరపు డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. థియటర్లలో అంతగా అకట్టుకోలేక పోయిన చిత్రం ఓటీటీలో ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.