'సాహో'కి నేను పనికొస్తానేమో...? ఉవ్విళ్లూరుతున్న బుల్లితెర 'పార్వతి'
మహదేవ హిందీ సీరియల్ ద్వారా పార్వతిగా అందరి మనస్సులను గెలుచుకున్న తార గుర్తింది కదూ. ఆమె పేరు సోనారికా భడోరియా. తెలుగు చిత్రం జాదూగాడు, స్పీడున్నోడు, ఈడో రకం ఆడో రకం చిత్రాల్లో నటించిన సోనారికా ఆమధ్య బికినీలో కనిపించి సంచలనం సృష్టించింది. పార్వతీదేవిగ
మహదేవ హిందీ సీరియల్ ద్వారా పార్వతిగా అందరి మనస్సులను గెలుచుకున్న తార గుర్తింది కదూ. ఆమె పేరు సోనారికా భడోరియా. తెలుగు చిత్రం జాదూగాడు, స్పీడున్నోడు, ఈడో రకం ఆడో రకం చిత్రాల్లో నటించిన సోనారికా ఆమధ్య బికినీలో కనిపించి సంచలనం సృష్టించింది. పార్వతీదేవిగా చూసి నిన్నలా బికినీలో చూడలేకపోతున్నాం... ప్లీజ్ రిమూవ్ ద పిక్చర్స్ అని నెటిజన్లు గోల చేస్తే చివరికి ఆ ఫోటోలను తొలగించింది. ఐతే ఇప్పుడు మెరుపుతీగలా సన్నగా తయారై కవ్విస్తోంది.
బాహుబలి చిత్రం గురించి చాలా ఎగ్జయిట్ అయినట్లు చెప్తోంది. తన సన్నిహితుల వద్ద ప్రభాస్ సరసన ఒక్కటంటే ఒక్క ఛాన్స్ వస్తే ఎంత బాగుంటుందో అని కళ్లు మూసుకుని వేరే లోకంలో విహరిస్తోందట. అంతేకాదు... ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సాహో చిత్రంలో తనే హీరోయిన్ అయితే ఇక చాలు దేవుడోయ్ అంటోందట. ఆశ... దోసె... అప్పడం... గారె... వడ... ప్రభాస్ ఆ ఛాన్స్ ఇస్తాడా ఏంటి? ఒకవేళ ఆమె అనుకున్నదే జరిగితే రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే కదా...!!