Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 10 January 2025
webdunia
Advertiesment

స్టైలిష్ విలన్‌తో బాలీవుడ్ హీరోయిన్ రొమాన్స్? బీటౌన్‌లో ఒకటే చర్చ

హీరో రాంచరణ్ 'ధృవ' చిత్రంతో టాలీవుడ్‌కు కొత్తగా పరిచయమైన విలన్ అరవింద్ స్వామి. ఈయన ఒకప్పటి హీరో. ఇపుడు టాలీవుడ్ స్టైలిష్ విలన్. ఈ విలన్‌తో బాలీవుడ్ హీరోయిన్ రొమాన్స్ చేస్తోంది. దీనిపై బిటౌన్‌లో తెగ చర

స్టైలిష్ విలన్‌తో బాలీవుడ్ హీరోయిన్ రొమాన్స్? బీటౌన్‌లో ఒకటే చర్చ
, ఆదివారం, 18 డిశెంబరు 2016 (13:17 IST)
హీరో రాంచరణ్ 'ధృవ' చిత్రంతో టాలీవుడ్‌కు కొత్తగా పరిచయమైన విలన్ అరవింద్ స్వామి. ఈయన ఒకప్పటి హీరో. ఇపుడు టాలీవుడ్ స్టైలిష్ విలన్. ఈ విలన్‌తో బాలీవుడ్ హీరోయిన్ రొమాన్స్ చేస్తోంది. దీనిపై బిటౌన్‌లో తెగ చర్చ సాగుతోంది. నిజానికి అరవింద్ స్వామి హీరోగా ఉన్న సమయంలో మగువల మనసుల్లో లవర్ బాయ్‌గా స్థానం సంపాదించుకున్నాడు. ముఖ్యంగా.. ఇతగాడికి 'రోజా', 'బొంబాయి' చిత్రాల వల్లే లవ్వర్‌ బాయ్‌గా పేరువచ్చిందని చెప్పొచ్చు. 
 
ఇప్పుడు తన రెండో ఇన్నింగ్స్‌ను విలన్‌గా ప్రారంభించాడు. అదీ కూడా స్టైలిష్ విలన్‌గా ఇరగదీస్తున్నాడు. తమిళ చిత్రం 'తని ఒరువన్'తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈయన.. తెలుగు రిమేక్ 'ధృవ'లోనూ విలన్‌గా హీరో కంటే అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో అరవింద్ స్వామి మళ్లీ హీరోగా మారాడు. 
 
మరోవైపు... మళయాళ సూపర్ హిట్ చిత్రం 'భాస్కర్‌ ద రాస్కెల్‌' తమిళ్ రిమేక్‌లో అరవింద్ స్వామి హీరోగా నటించబోతున్నారు. సిద్ధిఖీ దర్శకుడు. మొదట సూపర్ స్టార్ రజినీతో 'భాస్కర్‌ ద రాస్కెల్‌' రిమేక్ చేయాలని ప్రయత్నించారు. రజినీ నో చెప్పడంతో ఆ అవకాశం అరవింద్ స్వామికి దక్కింది. ఈ రిమేక్‌లో అరవింద్ స్వామి సరసన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా నటించనుంది. అయితే దీనిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. రజినీ 'లింగా' చిత్రంలో సోనాక్షి తన అందాలను ఆరబోసిన విషయం తెల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏ కల్చర్ అబ్బాయినో తెలియట్లేదు.. ఇక పిల్లెక్కడ దొరుకుతుంది: పెళ్లిపై రానా సెటైర్లు