Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏ కల్చర్ అబ్బాయినో తెలియట్లేదు.. ఇక పిల్లెక్కడ దొరుకుతుంది: పెళ్లిపై రానా సెటైర్లు

టాలీవుడ్ భల్లాలదేవుడు రానా. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న మోస్ట్ బ్యాచిలర్స్‌లలో ఒకడు ఈ దగ్గుబాటి హీరో. తనకంటే చిన్న హీరోలు పెళ్లి చేసుకుని సెటిలైపోతున్నాప్పటికీ.. రానా మాత్రం ఇంకా బ్యాచిలర్ జీవితాన్ని

Advertiesment
Rana Daggubati
, ఆదివారం, 18 డిశెంబరు 2016 (12:58 IST)
టాలీవుడ్ భల్లాలదేవుడు రానా. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న మోస్ట్ బ్యాచిలర్స్‌లలో ఒకడు ఈ దగ్గుబాటి హీరో. తనకంటే చిన్న హీరోలు పెళ్లి చేసుకుని సెటిలైపోతున్నాప్పటికీ.. రానా మాత్రం ఇంకా బ్యాచిలర్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. తాను ఇప్పటికీ పెళ్లి ఎందుకు చేసుకోలేదో తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు.
 
తాను ఏ కల్చర్‌కు చెందిన వాడినో తనకే అర్థ కావడం లేదు అంటూ తనపై తానే సెటైర్లు వేసుకున్నాడు. తాను మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చిన కొత్తలో చాలామంది తనను 'మదరాసి' అని పిలిచే వారని, తాను చెన్నైలో ఉండే రోజులలో తనను తెలుగు అబ్బాయి అని పిలిచేవారని చెపుతూ తాను బొంబాయి వెళితే తనను సౌత్ అబ్బాయి అని పిలుస్తున్నారని అందువల్ల తాను అయోమయంలో పడిపోయి ఏ ప్రాంతపు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్టు చెప్పుకొచ్చాడు. 
 
ఇదే సందర్భంలో తన లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతూ తన లైఫ్ స్టైల్ చాల అసాధారణంగా ఉంటుందని అందువల్ల తనను అర్థం చేసుకోవడం చాల కష్టమని దీనితో తనను బాగా అర్థం చేసుకుని అమ్మాయి గురించి ఎదురు చూస్తున్నట్టు చెప్పాడు. తన లైఫ్‌ను ఒక స్ట్రక్చర్‌లోకి తెచ్చుకున్న తర్వాత తాను పెళ్లి చేసుకుంటాను అంటూ తన పెళ్ళిపై ఓ క్లారిటీ ఇచ్చాడు ఈ భల్లాలదేవుడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హృతిక్ 'కాబిల్' మూవీకి కాపీ మరక.. యాక్షన్ సీన్స్‌ను అచ్చుగుద్దినట్టుగా తీశారా?