Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శృతిహాసన్‌పై ముచ్చటపడిన 'వకీల్ సాబ్'?

Advertiesment
శృతిహాసన్‌పై ముచ్చటపడిన 'వకీల్ సాబ్'?
, బుధవారం, 11 మార్చి 2020 (10:33 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం "వకీల్ సాబ్". బాలీవుడ్ చిత్రం "పింక్‌"కు రీమేక్. 'పింక్‌'లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుంటే, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
 
అయితే, ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా శృతిహాసన్‌ను తీసుకోవాలన్న తలంపులో చిత్ర యూనిట్ ఉన్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ - శృతిహాసన్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన "గబ్బర్ సింగ్" సూపర్ డూపర్ హిట్ కాగా, ఆ తర్వాత వచ్చిన "కాటమరాయుడు" చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. 
 
ఈ నేపథ్యంలో 'వకీల్ సాబ్' చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్‌కు జోడీగా శృతిహాసన్‌ను నటింపజేయాలన్న ఆలోచనలో దర్శకుడుతో పాటు.. హీరో ఉన్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అయితే, ఈ గుసగుసలు నిజమైతే పవన్‌తో శృతిహాసన్ జతకట్టడం ఇది మూడోసారి అవుతుంది. 
 
కాగా, వకీల్ సాబ్ మే నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అంతేకాకుండా, ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్రంలోని మగువా మగువా లిరికల్ సాంగ్‌ను విడుదల చేయగా, ఇది సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాహోతో మల్లీశ్వరి? నాగ్ అశ్విన్ దర్శకుడు ప్లాన్!