Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభాస్ హీరోయిన్‌ గొప్ప మనసు : అక్షయపాత్రకు విరాళం

ఒక బాలీవుడ్ హీరోయిన్ బాలీవుడ్ హీరోలకు ఆదర్శంగా నిలిచారు. ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయల మేరకు పారితోషికం అందుకుంటూ చిల్లిగవ్వకూడా దానం చేయడానికి మనసురాని బాలీవుడ్ హీరోలకు ఈ హీరోయిన్ ఆదర్శంగా నిలించారు

Advertiesment
ప్రభాస్ హీరోయిన్‌ గొప్ప మనసు : అక్షయపాత్రకు విరాళం
, గురువారం, 24 ఆగస్టు 2017 (07:09 IST)
ఒక బాలీవుడ్ హీరోయిన్ బాలీవుడ్ హీరోలకు ఆదర్శంగా నిలిచారు. ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయల మేరకు పారితోషికం అందుకుంటూ చిల్లిగవ్వకూడా దానం చేయడానికి మనసురాని బాలీవుడ్ హీరోలకు ఈ హీరోయిన్ ఆదర్శంగా నిలించారు. ఆమె పేరు శ్రద్ధా కపూర్. 
 
'ఆషికి-2', 'ఏబీసీడీ 2' తదితర చిత్రాలతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందిన ఈ కథానాయిక ఆకలితో ఉన్న పేద పిల్లలకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అక్షయపాత్ర అనే స్వచ్ఛంద సంస్థకు విరాళం అందించారు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న 12 రాష్ట్రాల్లోని 13,808 పాఠశాల్లో 1.6 మిలియన్‌ పిల్లలకు ఉచితంగా మధ్యాహ్న భోజనం వసతి కల్పిస్తోంది. 
 
శ్రద్ధా తను సహాయం చేయడమే కాదు.. అభిమానులు కూడా సాయం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. చాలా మంది పిల్లలు సరైన పౌషకాహారం పొందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. సుజీత్‌ దర్శకుడు. ఇందులో శ్రద్ధా కథానాయికగా నటిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'తాతయ్య... చిల్' అన్న 'అర్జున్ రెడ్డి' టీంకు 'జిల్ జిల్ ఝలక్'(వీడియో)