Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అరెయ్ ఇది పట్టుకో... దాన్ని చూడ్డం కంటే ఈ ప్లగ్‌లో ఏలెట్టడం మంచిది... 'బిగ్ బాస్'పై షాకింగ్ కామెంట్స్...

జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా నిర్వహిస్తున్న బిగ్ బాస్ తెలుగు షోపైన మిశ్రమ స్పందన వస్తోంది. కొందరైతే సూపర్ అని పొగుడుతుంటే మరికొందరు ఓ రేంజిలో సెటైర్లు విసురుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నవ్వును అదే పనిగా చూడాలంటే వల్ల కావడం లేదంటూ కామెంట్లు కొడుతున్నారు.

అరెయ్ ఇది పట్టుకో... దాన్ని చూడ్డం కంటే ఈ ప్లగ్‌లో ఏలెట్టడం మంచిది... 'బిగ్ బాస్'పై షాకింగ్ కామెంట్స్...
, సోమవారం, 17 జులై 2017 (12:55 IST)
జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా నిర్వహిస్తున్న బిగ్ బాస్ తెలుగు షోపైన మిశ్రమ స్పందన వస్తోంది. కొందరైతే సూపర్ అని పొగుడుతుంటే మరికొందరు ఓ రేంజిలో సెటైర్లు విసురుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నవ్వును అదే పనిగా చూడాలంటే వల్ల కావడం లేదంటూ కామెంట్లు కొడుతున్నారు. మరికొందరి కామెంట్లయితే ఓ రేంజిలో వుంటున్నాయి.
 
అత్తారింటికి దారేది చిత్రంలో బ్రహ్మానందం ఓ డైలాగ్ కొడ్తాడు. అరేయ్ ఇది పట్టుకో... ప్లగ్ లో వేలెట్టడం మంచిది అంటూ నవ్వులు పూయిస్తాడు. అలాంటి కామెంట్లనే కొందరు ఇక్కడ జోడిస్తున్నారు. అదెలాగయ్యా అంటే... అరెయ్ ఇది పట్టుకో... దాన్ని(బిగ్ బాస్) చూడ్డం కంటే ఈ ప్లగ్‌లో ఏలెట్టడం మంచిది... అంటూ సెటైర్లు వేస్తున్నారు. 
 
ఇక మరికొందరైతే ఎలాగూ సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ స్టామినా లెవల్లో వీళ్లు వెళ్లలేరు కనుక... హోస్టుల్లో కమల్ హాసన్ బెటరా... లేదంటే జూ.ఎన్టీఆర్ బెటరా అంటూ పోస్టింగులు చేస్తున్నారు. మొత్తమ్మీద మిశ్రమ స్పందన మధ్య జూ.ఎన్టీఆర్ బిగ్ బాస్ షో ప్రారంభమైంది. ఇక ముందు దీని రేంజ్ ఏ స్థాయికి వెళుతుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నోటీసులంటే వణికిపోతున్న సినీ ప్రముఖులు... జాబితాలో 19కు చేరిన పేర్లు