సమంత ఒప్పుకోవడం లేదట... ఎందుకంటే...?
స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత, ఈ ఏడాది వేసవి సీజన్ నుంచీ ఏదో ఒక రకంగా వార్తల్లో ఉంటూ వస్తున్నారు. ఆమె హీరోయిన్‌గా నటించిన 'తేరీ', '24', 'అ..ఆ..', 'జనతా గ్యారేజ్' లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాలుగా నమోదై సమంత క్రేజ్‌ను ఎత్తుకు ఎదిగేలా
స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత, ఈ ఏడాది వేసవి సీజన్ నుంచీ ఏదో ఒక రకంగా వార్తల్లో ఉంటూ వస్తున్నారు. ఆమె హీరోయిన్‌గా నటించిన 'తేరీ', '24', 'అ..ఆ..', 'జనతా గ్యారేజ్' లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాలుగా నమోదై సమంత క్రేజ్‌ను ఎత్తుకు ఎదిగేలా చేశాయి. అయితే 'జనతా గ్యారేజ్' విడుదలై రెండు నెలలు అవుతున్నా సమంత తెలుగులో ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు.
ఈ మధ్యలో చాలా సినిమాల్లో ఆమె నటిస్తున్నట్లు వార్తలొచ్చినా అవేవీ నిజమవ్వలేదు. దీంతో సమంత ఏ సినిమా చేస్తారా? అని ఎదురుచూసిన వారందరికీ సమాధానంగా విశాల్ హీరోగా తెరకెక్కుతోన్న ఓ తమిళ సినిమాను ఒప్పుకున్నారు. ఇక ఈ సినిమాను మినహాయిస్తే సమంత వేరే ఇతర సినిమాలేవీ ఒప్పుకోలేదట. తెలుగులో అయితే ఇంకా ఏ సినిమానూ ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై కొందరు మరో రకంగా స్పందిస్తున్నారు. సమంత-నాగచైతన్య పెళ్లి ఘడియలు దగ్గరపడ్డాయేమోనని అంటున్నారు.