Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ కళ్యాణ్ అలాంటోడా? అప్పుడు బాబీ డమ్మీ... ఇప్పుడు డాలీకి బొమ్మ కనబడుతోందా?

పవన్ కళ్యాణ్ అంటే అంతేనంటారు ఆయనని దగ్గరగా చూసిన జనం. చెప్పదలుచుకున్నది, అనుకున్నది అనుకున్నట్లుగా చేయడం పవన్ కళ్యాణ్‌కు అలవాటని టాలీవుడ్ ఇండస్ట్రీలో మాట. పవన్ సినిమా అంటే డైరెక్షన్ డిపార్టుమెంటులో పవన్ వేలు పెట్టడం ఖాయమనే వాదనలు కూడా ఉన్నాయి. గతంలో

Advertiesment
పవన్ కళ్యాణ్ అలాంటోడా? అప్పుడు బాబీ డమ్మీ... ఇప్పుడు డాలీకి బొమ్మ కనబడుతోందా?
, గురువారం, 27 అక్టోబరు 2016 (18:53 IST)
పవన్ కళ్యాణ్ అంటే అంతేనంటారు ఆయనని దగ్గరగా చూసిన జనం. చెప్పదలుచుకున్నది, అనుకున్నది అనుకున్నట్లుగా చేయడం పవన్ కళ్యాణ్‌కు అలవాటని టాలీవుడ్ ఇండస్ట్రీలో మాట. పవన్ సినిమా అంటే డైరెక్షన్ డిపార్టుమెంటులో పవన్ వేలు పెట్టడం ఖాయమనే వాదనలు కూడా ఉన్నాయి. గతంలో గబ్బర్ సింగ్ చిత్రం చేసేటపుడు డైరెక్టర్ బాబీ డమ్మీగా మారిపోయి తను చేయదలచుకున్నది చేయలేకపోయాడట. దీనితో గబ్బర్ సింగ్ తుస్సుమంది. ఆ తర్వాత ఇప్పుడు కాటమరాయుడు చిత్రం మొదలైంది. 
 
ఈ చిత్రానికి దర్శకుడు బాబీ. ఐతే కాటమరాయుడు చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ - బాబీలకు మధ్య ఎక్కడో గ్యాప్ వచ్చిందని సమాచారం. దీనితో పవన్ దర్శకుడు డాలీపై కస్సుబుస్సుమని రంకెలు వేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఇద్దరూ ఎడమొఖం పెడముఖంగా ఉంటున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ తో వేగడం చాలా కష్టమనీ, అందువల్ల డాలీ కాటమరాయుడు నుంచి తప్పుకునే చాన్స్ ఉందనీ ప్రచారం జరుగుతోంది. మరి కాటమరాయుడు ఏమవుతుందో వెయిట్ అండ్ సీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'పక్కా లోకల్.. నేనూ పక్కా లోకల్' అంటూ స్టెప్పులతో ఇరగదీసిన రోజా.. వీడియో హల్‌చల్