''సాహో'' కోసం రామోజీ ఫిలిమ్ సిటీలో భారీ సెట్ వేయాల్సిందేనా?
రామోజీ ఫిల్మ్ సిటీలో ''సాహో'' సినిమా కోసం భారీ సెట్ వేయనున్నారని తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ''సాహో''. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో జరపాలనుకున్నారు
Publish Date: Mon, 26 Feb 2018 (18:40 IST)
Updated Date: Mon, 26 Feb 2018 (18:42 IST)
రామోజీ ఫిల్మ్ సిటీలో ''సాహో'' సినిమా కోసం భారీ సెట్ వేయనున్నారని తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ''సాహో''. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో జరపాలనుకున్నారు. కానీ అక్కడ భారీ యాక్షన్ సన్నివేశాలకు అనుమతులు లభించకపోవడంతో సెట్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎంతగా ప్రయత్నించినా అక్కడి నుంచి అనుమతులు రాకపోవడంతో, రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ స్థాయిలో సెట్ వేసి షూటింగ్ చేయాలనుకుంటున్నారని యూనిట్ వర్గాల సమాచారం. అయితే ఈ సెట్ కోసం భారీగా ఖర్చు చేయాల్సి వుంటుంది. సెట్ లో చిత్రీకరించడం వలన, గ్రాఫిక్స్ కూడా అవసరమవుతాయి. అందువలన ఈ సినిమా టీమ్ సెట్ విషయంలో ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
selvi
Publish Date: Mon, 26 Feb 2018 (18:40 IST)
Updated Date: Mon, 26 Feb 2018 (18:42 IST)