పెళ్లి రూమర్లపై ఓ సినిమా తీస్తా.. టైటిల్ 'పెళ్లి గోల' : రేణూ దేశాయ్

శుక్రవారం, 10 జులై 2020 (18:57 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్. భర్తకు విడాకులు  ఇచ్చిన తర్వాత మరో పెళ్లి చేసుకోలేదు. లోగడ ఓ వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ, వాటిపై ఆమె స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇంతవరకు పెళ్లికి సంబంధించిన ఎలాంటి సమాచారం బయటకురాలేదు. 
 
ఇద్దరు పిల్లల తల్లి అయిన రేణూ దేశాయ్... పవన్ కల్యాణ్‌కు దూరమైన తర్వాత రేణు దేశాయ్ తన కెరీర్ పై పూర్తిగా దృష్టి సారించారు. దర్శకురాలిగా, రచయితగా బిజీగా ఉన్నారు. అయితే, పవన్ ఫ్యాన్స్ మాత్రం రేణూ దేశాయ్‌ని వదిలిపెట్టడం లేదు. రెడో పెళ్ళి గురించి ప్రశ్నిస్తూనే ఉన్నారు. 
 
తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చిన ఆమెకు... ఇవే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆమెకు అవే ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి ఆమె ఫన్నీగా సమాధానం చెప్పారు. 
 
అందరూ తన పెళ్లి గురించే అడుగుతున్నారని... తాను పెళ్లి చేసుకున్నా వారికి ఇబ్బందేనని, పెళ్లి చేసుకోకపోయినా ఇబ్బందేనని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ ప్రశ్నలతో తాను విసిగిపోయానని చెప్పారు. వీటన్నింటికీ ఒక సమాధానంగా ఒక సినిమా తీస్తానని... దానికి 'పెళ్లి గోల' అనే టైటిల్ పెడతానని చమత్కారించారు. 
 
నా అస్సలు పేరు అది కాదు.. 
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన అస్సలు పేరు రేణూ దేశాయ్ కాదని చెప్పారు. తన తండ్రి పెట్టిన పేరు హీరావతి అని చెప్పారు. అలాగే, తన నాన్నమ్మ పెట్టిన పేరు రేణుకా దేవి అని వివరించారు. అయితే, తన తండ్రి 2012లో మరణించిన తర్వాత తన నాన్నమ్మ రేణుకా దేవిగా మార్చారు. అయితే, తాను సినీ ఇండస్ట్రీకి పరిచయమైన తర్వాత రేణూ దేశాయ్‌గా మార్చారని ఆమె వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం తనీష్‌కి ఈసారైనా సక్సస్ వచ్చేనా..?