Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

Pushpa-2

సెల్వి

, సోమవారం, 23 డిశెంబరు 2024 (20:03 IST)
బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ మూవీ ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో మరో హిట్ అందుకుంది రష్మిక మందన్నా. ఈ సినిమాలో శ్రీవల్లిగా మెప్పించింది. 
 
ఇక ఈ సినిమాలో పీలింగ్స్ పాటలో తన స్టెప్పులతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ పాట అల్లు అర్జున్‌తో డ్యాన్స్ చేస్తున్నందుకు మురిసిపోయానని పేర్కొంది. కానీ మొదట్లో కాస్త భయంగా, అసౌకర్యంగా అనిపించిందని వెల్లడించింది. 
 
సాధారణంగా తనను ఎవరైనా ఎత్తుకుంటే భయమేస్తుందని.. పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుని స్టెప్పేస్తారని తెలిపింది. అప్పుడు చాలా భయపడ్డానని.. ఆ తర్వాత నార్మల్‌గా అనిపించిందని చెప్పుకొచ్చింది. సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందే ఈ పాట షూట్ చేశామని.. మొత్తం ఐదు రోజుల్లో షూటింగ్ పూర్తి చేశామని తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?