Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''బేఫికర్'' ట్రైలర్ రిలీజ్.. రణ్‌వీర్‌సింగ్‌కు ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్.. గుడ్ నైట్ చెప్పి..?

సినిమా వాళ్లంటే జనాలకు తీరని మోజు. థియేటర్లో కనిపించే తమ అభిమాన నటీనటులు కళ్ల ముందు ప్రత్యక్షమైతే ఆ థ్రిల్లే వేరు. అందుకే వాళ్లను చూసే ఏ చిన్న అవకాశమైనా చాలామందికి ఏనుగెక్కినంత సంబరం. సినీతారల్ని అభిమ

Advertiesment
Ranveer Singh
, బుధవారం, 12 అక్టోబరు 2016 (16:41 IST)
సినిమా వాళ్లంటే జనాలకు తీరని మోజు. థియేటర్లో కనిపించే తమ అభిమాన నటీనటులు కళ్ల ముందు ప్రత్యక్షమైతే ఆ థ్రిల్లే వేరు. అందుకే వాళ్లను చూసే ఏ చిన్న అవకాశమైనా చాలామందికి ఏనుగెక్కినంత సంబరం. సినీతారల్ని అభిమానులు ఆరాధిస్తారు. ఒక్కసారైనా తమ అభిమాన నటీనటులను చూడాలని.. కలవాలని తాపత్రయపడతారు. అయితే ఆ అవకాశం వచ్చినప్పుడు వారు అభిమానాన్ని చాటుకోవడంతో పాటు వింత ప్రశ్నలు వేసి వారిని ఇరకాటంలో పడేస్తుంటారు. అలాంటి సంఘటనే తాజాగా బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్‌కి ఎదురైంది. వెంటనే తేరుకొని అభిమానికి సర్దిచెప్పి అక్కడినుండి పంపించేశాడు.
 
రణ్‌వీర్‌సింగ్‌.. వాణికపూర్‌ జంటగా నటించిన ''బేఫికర్'' చిత్రం తొలి ట్రైలర్‌ను యూనిట్ ఇటీవల పారిస్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రణ్‌వీర్‌ అభిమాని ఒకరు స్టేజ్‌పైకి వచ్చి ''బాజీరావ్‌ మస్తానీ'' చిత్రంలోని డైలాగ్‌ చెప్పిఅందరిని ఆకట్టుకున్నాడు. వెళ్తూ.. వెళ్తూ తనకున్న సందేహాన్ని తీర్చుకున్నాడు. అదేంటంటే.. ఆ అభిమాని ప్రియురాలికి ఇది వరకు రణ్‌వీర్‌సింగే బాయ్‌ఫ్రెండ్‌గా ఉన్నాడట. దీపికా పదుకొణె కోసం రణ్‌వీర్‌ తనని వదిలేశాడని అతనికి చెప్పిందట. ఈ విషయం నిజమేనా? అని ప్రశ్నించాడు.
 
దీంతో రణ్‌వీర్‌ ఉలిక్కిపడ్డాడు. కానీ.. వెంటనే తేరుకొని అతనికి గుడ్‌నైట్‌ చెప్పి, ఆ విషయంపై రేపు సవివరంగా మాట్లాడుకుందామని స్టేజ్‌ నుంచి పంపించేశాడు. ఇదే విషయంపై రణ్‌వీర్‌ మాట్సాడుతూ...''గతంలో నాకు ఇండియన్‌.. ఫ్రెంచ్‌ గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉండేవారు. ఇండియన్‌.. ఫ్రెంచ్‌ అమ్మాయిలు సున్నిత మనస్కులు, మగవారికంటే ధైర్యవంతులు. వారితో నాకు మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. అంతమందిలో ఇతను చెబుతున్న ఆవిడ ఎవరో నేను గుర్తించలేను'' అని చమత్కరించాడు రణ్‌వీర్‌.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈగకు పద్మశ్రీ వచ్చి వుంటే బాగుండేది.. బాహుబలి విషయంలో కథ నిల్: కోడి రామకృష్ణ