ఈగకు పద్మశ్రీ వచ్చి వుంటే బాగుండేది.. బాహుబలి విషయంలో కథ నిల్: కోడి రామకృష్ణ
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ''బాహుబలి'' ఇండియన్ సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి బాహుబలి సినిమా సాంకేతికంగా అద్భుతమైన సినిమానే కానీ.. కథ, కథనాల పరంగా మా
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ''బాహుబలి'' ఇండియన్ సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి బాహుబలి సినిమా సాంకేతికంగా అద్భుతమైన సినిమానే కానీ.. కథ, కథనాల పరంగా మాత్రం బాహుబలికి మరీ ఎక్కువ మార్కులు ఏమీ పడవు. అనేక అవార్డులూ, జాతీయ స్థాయిలో ఈ సినిమాకు గుర్తింపు లభించింది. అయితే అదే సమయంలో వచ్చిన విమర్శలూ లేకపోలేదు.
అయితే వాటినెవరూ పట్టించుకోలేదు. కానీ మొన్న జాతీయ అవార్డు విషయంలో మాత్రం కొందరు కాస్త చాటుమాటుగా, మరికొందరు బాహాటంగానే ''బాహుబలి'' ఒక కమర్షియల్ సినిమానే తప్ప అందులో జాతీయ అవార్డు రావాల్సినంత విషయం ఏమీ లేదంటూ వ్యాఖ్యలు చేసారు. కాగా అపూర్వ ప్రేక్షకాదరణ పొందిన బాహుబలి మీద సీనియర్ నటి జమున చేసిన కామెంట్‌లు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
తాను సినిమాలు చూడటం మానేసి చాలాకాలమైందని.. తన మనమడు బలవంతం పెట్టటంతో బాహుబలి మూవీని చూశానని చెప్పిన ఆమె.. దాన్నో ''స్టుపిడ్ సినిమా''గా తేల్చేశారు. ఈ పదానికి సరైన అర్థం ఏదైనా ఉంటే ఉపయోగించాలని వ్యాఖ్యానించారు. టెక్నికల్ గా ఓకే అయిన ఈ సినిమాలో మరేం లేదని తేల్చేశారు. ఈ సినిమాలో కథంటూ ఏమీ లేదన్న ఆమె.. ఒక్కహీరో పాత్ర తప్పించి మరే పాత్రకు ఎంపిక సరిగా లేదని తేల్చేశారు. ఇప్పుడు రాజమౌళి కంటే ముందే అద్భుతమైన గ్రాఫిక్స్‌ని తెలుగు తెరకు చూపించిన కోడి రామకృష్ణ కూడా అదే విషయం చెప్పాడు. ఈగ సినిమా రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమని..ఆ సినిమాకు రాజమౌళికి పద్మశ్రీ వచ్చి ఉంటే బాగుండేదని అన్నాడు.
అలాగే బాహుబలి సినిమా విషయంలో రాజమౌళి కంటే కూడా అంత భారీ బడ్జెట్ పెట్టడానికి రెడీ అయిన ప్రొడ్యూసర్స్‌ని అభినందించాలని చమత్కరించారు. కథను సాంకేతికత ఎప్పుడూ డామినేట్ చేయకూడదని, కథకు బలమవ్వాలని చెప్పాడు. సినిమా కోసం గ్రాఫిక్స్ అంటే అందంగా, అద్భుతంగా ఉంటుందని…అదే గ్రాఫిక్స్ కోసం సినిమా అంటే మాత్రం ఫైనల్‌గా చెప్పుకొవడానికి ఏమీ ఉండదని చెప్పాడు. అనుష్క లాంటి ఓ గ్లామరస్ హీరోయిన్ తప్ప వేరే అట్రాక్షన్స్ ఏమీ లేకపోయినప్పటికీ అరుంథతి లాంటి సినిమా తీసి రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టిన కోడి రామకృష్ణ చెప్పడం నిజంగా ఆశ్చర్యం కలుగిస్తోంది.