Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రుతి వల్ల పవన్ సినిమా ఆగిపోయిందా.... ఎందుకబ్బా?

జనసేన పార్టీ అధ్యక్షుడు, టాలీవుడ్ టాప్ హీరో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా డాలీ దర్శకత్వంలో రూపొందుతున్న 'కాటమరాయుడు' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథ

Advertiesment
Shruti hassan
, బుధవారం, 12 అక్టోబరు 2016 (14:14 IST)
జనసేన పార్టీ అధ్యక్షుడు, టాలీవుడ్ టాప్ హీరో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా డాలీ దర్శకత్వంలో రూపొందుతున్న 'కాటమరాయుడు' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా శ్రుతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈ నెల 5వ తేదీ నుంచి రామేశ్వరంలో ప్లాన్ చేశారు. అయితే ఈ షెడ్యూల్ వాయిదా పడినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నారు.
 
 శ్రుతిహాసన్ ఈ డేట్స్‌లో హాజరు కాలేకపోతున్నందు వలన, షూటింగ్‌ను నవంబర్‌కి వాయిదా వేసినట్టు సినీనిపుణులు అంటున్నారు. వచ్చేనెల నుంచి షూటింగ్ వేగం పెంచి, ఫిబ్రవరి నాటికి పూర్తిచేయాలనే ఆలోచనలో వున్నారని అంటున్నారు. పవన్ - శ్రుతిహాసన్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో, ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి రేకెత్తుతోంది.
 
 కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన స్పీడ్ ఏంటో చూపించడానికి ఈ సినిమాతో రెడీ అయ్యాడు. ఎప్పుడూ కూడా నింపాదిగా సినిమాలు చేస్తాడని, తనకు నచ్చినప్పుడు షూటింగ్‌లు ప్లాన్ చేసుకుంటాడని పవన్ పైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అభిమానులు కూడా ఈ విషయంలో పవన్‌ని వ్యతిరేకిస్తుంటారు. వరుసగా సినిమాలు చేయమని పవన్‌పైన ఒత్తిడి తెస్తూ ఉంటారు. అభిమానుల మాటే విన్నాడో. లేక 2019లోపు వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసేయాలని ఫిక్స్ అయ్యాడో కానీ ఓవరాల్‌గా పవన్ మాత్రం ఫుల్ సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమమ్‌లో సమంత అలా మిస్సయ్యిందనమాట..