Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాకు మొసలి మాంసం అంటే చాలా ఇష్టం.. లొట్టలేసుకుని తింటా: రణబీర్ కపూర్

రణ్బీర్ కపూర్, ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మలు ప్రధాన పాత్రల్లో దర్శక, నిర్మాత కరణ్ జోహర్ తెరకెక్కిస్తున్న 'యే దిల్ హై ముష్కిల్' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. రొమాంటిక్ డ్రామాగా అలరించను

Advertiesment
Foodie
, సోమవారం, 5 సెప్టెంబరు 2016 (12:10 IST)
రణ్బీర్ కపూర్, ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మలు ప్రధాన పాత్రల్లో దర్శక, నిర్మాత కరణ్ జోహర్ తెరకెక్కిస్తున్న 'యే దిల్ హై ముష్కిల్' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. రొమాంటిక్ డ్రామాగా అలరించనున్న 'యే దిల్ హై ముష్కిల్' చిత్ర టీజర్కు సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చిత్రంతో రణ్ బీర్ కపూర్ తొలిసారి ఐశ్వర్యతో జతకట్టారు.
 
వీరి మధ్య నడిచే సన్నివేశాలు సినిమాకు హైలైట్ అని దర్శకనిర్మాతలు అంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న రణ్ బీర్‌ తన అభిరుచుల గురించి మీడియాకి వెల్లడించాడు. తనకి మొసలి మాంసం అంటే చాలా ఇష్టమని... లొట్టలేసుకుంటూ తింటానని చెప్పాడు. అందరూ మొసలి మాంసం అంటే అసహ్యించుకుంటారు... కానీ తాను తినే వంటకాల్లో మొసలి మాంసం చాలా రుచికరంగా ఉంటుందని చెప్పి అందరిని అబ్బురపరిచాడు. 
 
అంతేకాదు తన నానమ్మ కృష్ణ కపూర్ చేతి వంటంటే.. కపూర్ కుటుంబం మొత్తానికి ఎంతో ఇష్టమని చెప్పాడు. నెయ్యి వేసి చేసిన రోటీలంటే చాలా ఇష్టమని చెప్పాడు. సినిమాల్లోకి వచ్చాక ఫిట్నెస్ కోసం తన ఆహార అలవాట్లన్నీ మార్చుకున్నానని...అందుకోసం సొంత వంట మనిషిని పెట్టుకుని కావాల్సినవన్ని చేయించుకుని తింటున్నానని తన మనసులోని మాటను బయటపెట్టాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సన్నీ లియోన్‌కు అరుదైన ఘనత: ర్యాంప్ మీద ఓపెనింగ్ షోలో వాక్..