సన్నీ లియోన్‌కు అరుదైన ఘనత: ర్యాంప్ మీద ఓపెనింగ్ షోలో వాక్..
తన అందాల విందుతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సెక్సీ బాంబ్ సన్నీలియోన్ మరో అరుదైన ఘనతను సాధించబోతోంది. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ మీద నడవబోతున్న మొట్టమొదటి బాలీవుడ్ నటిగా ఆమె గుర్
తన అందాల విందుతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సెక్సీ బాంబ్ సన్నీలియోన్ మరో అరుదైన ఘనతను సాధించబోతోంది. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ మీద నడవబోతున్న మొట్టమొదటి బాలీవుడ్ నటిగా ఆమె గుర్తింపు పొందనుంది. ఈ విషయాన్ని సన్నీ లియోన్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇంత పెద్ద ఈవెంట్‌లో పాల్గొనే అవకాశం తనకు దక్కినందుకు ఆమె ఎగిరిగంతేస్తోంది.
ప్రముఖ డిజైనర్ అర్చనా కొచ్చర్ రూపొందించిన వస్త్రాలను ధరించి ర్యాంప్ మీద ఓపెనింగ్ షోలో తాను నడవబోతున్నట్లు సన్నీ అభిమానులకు ట్వీట్ చేసింది. ఇక ఇదే విషయం గురించి డిజైనర్ అర్చనా కొచ్చర్ కూడా ట్వీట్ చేసింది. తాను భారతదేశంలో పర్యటించినప్పుడు పొందిన అనుభూతులతో రూపొందించిన 'ఎ టేల్ ఆఫ్ టూ ట్రావెల్స్' అనే డిజైనర్ దుస్తులను సన్నీ కోసం అర్చన ఇస్తున్నారు.