Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

ఒక్కరోజు స్టే కోసం కోట్ల రూపాయల ఇంటిని కొన్న రామ్ చరణ్?

Advertiesment
Ram Charan
, మంగళవారం, 13 జులై 2021 (22:23 IST)
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటుడే కాదు మంచి బిజినెస్ మేన్ కూడా. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మార్కెట్‌కు అనుగుణంగా తన వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగా చరణ్ అనేక సంస్ధలను స్థాపించారట. ఇదివరకే ముంబైలోని సముద్రతీరంలో అధునాతన బంగ్లాలను కొనుగోలు చేశారు.
 
నటీనటులు షూటింగ్‌ల కోసం వివిధ ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. అక్కడ వారు హోటళ్లలో బసచేస్తారు. అయితే ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాలలో నటించే రామ్ చరణ్ తరచూ ముంబై వెళ్ళి నిర్మాతలను కలిసి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిసారి హోటళ్లలో దిగడం.. దానికి వేలకు వేలు ఖర్చుపెట్టడం ఎందుకనే ఆలోచనలోనే ఇళ్ళు కొనుగోలు చేశారట.
 
ముంబై శివార్లలో సంపన్నులు నివశించే ప్రాంతంలో ఇళ్లను కొనుగోలు చేయడమే కాకుండా తనకు ఉపయోగం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చరణ్ సన్నిహితులు చెబుతున్నారు. చరణ్ కొనుగోలు చేసిన ఇళ్ళు బీచ్ ఫేస్‌లో ఎంతో విలాసవంతంగా ఉందని.. ఈ ఇంటికి దాదాపు 35 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు చరణ్ ఫ్యామిలీతో సహా అక్కడికి వెళ్ళి ఎన్నిరోజులైనా స్టే చేసే విధంగా ఇళ్ళు కొనుగోలు చేశారని సన్నిహితులు చెబుతున్నారు. 
 
అయితే షూటింగ్‌కు వెళ్ళినప్పుడు ఒకటి, రెండురోజులు మాత్రమే అక్కడ ఉంటారట. మిగిలిన రోజులు మొత్తం ఆ ఇల్లు ఖాళీగానే ఉంటుందట. ఒక్కరోజు కోసం ఎందుకు అంత వెచ్చించి ఇంటిని కొన్నావని ఉపాసన అడిగితే బయట హోటళ్ళలో ఉండటం ఇష్టం లేదని చెర్రీ చెబుతున్నాడట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్ళి ఆగిపోయినా యాక్టివ్‌గా షూటింగ్ సెట్లో మెహరీన్