ఉపాసన కామినేని కొణిదెల, రామ్ చరణ్‌లకు కవలలు పుట్టబోతున్నారని తెలిసింది. ఈ జంట త్వరలో కవలలను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఉపాసన బేబీ షవర్ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చెర్రీ దంపతులు కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా ఉపాసన తల్లి శోభన కామినేని ఈ శుభవార్తను షేర్ చేశారు. రామ్ చరణ్- ఉపాసన ట్విన్ బేబీస్ రాబోతున్నారు అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో ఉపాసన కవలలకు జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ దీపావళి కచ్చితంగా డబుల్ ధమాకాగా వచ్చింది.
అనిల్, తాను వచ్చే ఏడాది ఉపాసన, చెర్రీ కవలలను స్వాగతించేందుకు సిద్ధంగా వున్నామని తెలిపారు. ఇకపోతే.. మెగా ఫ్యామిలీకి వారసుడు రాబోతున్నాడంటూ మెగా ఫ్యాన్స్ అప్పుడే సంబరాలు చేసుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.