Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

RC16: జాన్వీ కపూర్ స్థానంలో మృణాల్ ఠాకూర్..? (video)

Advertiesment
mrunal thakur
, గురువారం, 13 జులై 2023 (10:21 IST)
టాలీవుడ్ అగ్రనటుల్లో ఒకడైన రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించాడు. ఈ చిత్రం ద్వారా గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వెయ్యికోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం చెర్రీ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.
 
ఈ సినిమాకు తర్వాత చెర్రీ ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు డైరక్షన్‌లో నటించబోతున్నాడు. ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి ఆర్సీ 16 పేరిట రూపొందిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించనున్నాడని సమాచారం. అంతేగాకుండా ఈ చిత్రంలో చెర్రీ సరసన సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ నటించనున్నట్లు తెలుస్తోంది. 
 
ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ను తీసుకోవాలనుకున్నారు. అయితే ఇందులో జాన్వీ నటించలేదని.. ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్‌ను తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 

ఈ భారీ బ‌డ్జెట్ మూవీకి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఏఆర్ రెహ‌మాన్‌ను ఫిక్స్ చేశారు. రామ్ చ‌ర‌ణ్ మూవీకి మ్యూజిక్‌ అందించ‌బోతున్న‌ట్లు రెహ‌మాన్ స్వ‌యంగా ప్ర‌క‌టించాడు. ఆగ‌స్ట్ లేదా సెప్టెంబ‌ర్‌లో ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాడీ షేమింగ్‌కు గురయ్యానా?.. పుకార్లు భలే సృష్టిస్తారండీ : కావ్యా కళ్యాణ్ రామ్