Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ వయసు దాటితే హీరోలు - డైరెక్టర్లు లైక్ చేయరు..: రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్‌లో మంచి జోరుమీదున్న కుర్రకారు హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్‌పై స్పందిస్తూ ఇరవై ఏళ్ల తర్వాత సినీ పరిశ్రమలో అడుగుపెట్టే హీరోయిన్లకు ఎక్కువకాలం ఇండస్ట్రీ

Advertiesment
rakul preet singh
టాలీవుడ్‌లో మంచి జోరుమీదున్న కుర్రకారు హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్‌పై స్పందిస్తూ ఇరవై ఏళ్ల తర్వాత సినీ పరిశ్రమలో అడుగుపెట్టే హీరోయిన్లకు ఎక్కువకాలం ఇండస్ట్రీలో కొనసాగే అవకాశం చాలా తక్కువన్నారు. 
 
ఎందుకంటే మూడు పదులు దాటిన హీరోయిన్‌ను హీరోలు, దర్శకులేకాదు నిర్మాతలు సైతం ఇష్టపడరని చెప్పుకొచ్చింది. అందువల్ల చిన్న వయసులోనే హీరోయిన్ కావడం ఓ గొప్ప అవకాశమంది. 
 
ఇలాంటి గుడ్డు పరిస్థితులను ఎదుర్కొని నయనతార, అనుష్కలాంటి వాళ్లు ఇంకా విజయవంతంగా తమ కెరీర్‌ను కొనసాగిస్తున్నారంటే గొప్ప విషయమన్నారు. అదేసమయంలో ఇన్నేళ్ల పాటు పరిశ్రమలో కొనసాగాలనే లక్ష్యమేదీ తనకు లేదని... 'రకుల్ బాగా నటిస్తోంది, పర్వాలేదు ఆమెను చూడవచ్చు' అని అభిమానులు అనుకున్నంత వరకు తాను నటిస్తూ ఉంటానని తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ రెండు 'స్పాట్‌'లు చూపించకుండా నటించా... రాద్దాంతం వద్దు : 'న్యూడ్‌'పై సంజన వివరణ