Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 31 March 2025
webdunia

రకుల్ ప్రీత్ సింగ్‌ను వాడతానంటున్న సీనియర్ డైరెక్టర్...

రకుల్ ప్రీత్ సింగ్.. చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక క్రేజ్‌ను సంపాదించుకుంది. అగ్రహీరోలతో కూడా నటించేసింది. మొదట్లో యువ హీరోలతో కెరీర్‌ను ప్రారంభించి ఆ తరువాత అగ్రహీరోల సరసన నటించి రకుల్ ఏ క్యారెక్టర్‌నైనా అవలీలగా చేయగల

Advertiesment
rakul preet singh
, శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (14:17 IST)
రకుల్ ప్రీత్ సింగ్.. చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక క్రేజ్‌ను సంపాదించుకుంది. అగ్రహీరోలతో కూడా నటించేసింది. మొదట్లో యువ హీరోలతో కెరీర్‌ను ప్రారంభించి ఆ తరువాత అగ్రహీరోల సరసన నటించి రకుల్ ఏ క్యారెక్టర్‌నైనా అవలీలగా చేయగలదన్న పేరును తెచ్చుకుంది. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు దర్శకులకు బంపర్ ఆఫర్ ఇచ్చేస్తోంది.
 
మంచి సినిమా.. బ్రహ్మాండమైన కథ... హీరోయిన్‌కు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ సినిమా అయితే అందాలను ఎంతయినా ఆరబోయడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతోందట. కొంతమంది డైరెక్టర్లకు ఇదే విషయాన్ని రకుల్ చెబుతూ వస్తోందట. మొదట్లో ఇంతకుమించి అందాలను ఆరబోయకూడదని హద్దులు గీసుకున్నా.. ఇప్పుడు ఆ హద్దులను చెరిపేస్తూ... ఎలాగైనా నటించాలని ఉందని చెపుతోందట. అయితే సినిమా కథ నాకు బాగా నచ్చాలంటోందట రకుల్ ప్రీత్ సింగ్. 
 
ఇప్పటికే అందాల ఆరబోతలో ముందుండే రకుల్ మరింత.. అందాలను ఆరబోస్తే తెలుగు ప్రేక్షకులు ఏమవుతారో... అయితే ఈమె అందాలను ఎలా చూపించాలో అలా చూపించేందుకు డైరెక్టర్ రాఘవేంద్రరావు సిద్ధంగా ఉన్నారట. రకుల్ కోసం ప్రత్యేకంగా కథను కూడా సిద్ధం చేసుకున్నారట. డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్ అందాలను ప్రేక్షకుల చూపించడంలో రాఘవేంద్రరావు దిట్ట. అందుకే ఆమె అందాలను సరిగ్గా చూపిస్తానంటున్నారాయన. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుందట. చాలా రోజుల గ్యాప్ తరువాత రాఘవేంద్రరావు తీయబోతున్న సినిమాలో రకుల్‌ను ఏ విధంగా చూపిస్తారోనన్న ఆసక్తి తెలుగు సినీపరిశ్రమలో నెలకొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ క్రేజ్ గోవిందా... రానా యారీ క్రేజ్ అదుర్స్.. ఎందుకని?