టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ అమ్మడుకు సినీ అవకాశాలు వరుసబెడుతున్నాయి. దీంతో తన జోరును మాత్రం కొనసాగిస్తూనే ఉంది. ఒకవైపు ఫోటోషూట్‌లతో బిజీగా ఉంటూనే మరోవైపు హాట్ హాట్ ఫొటోలతో యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది.
తాజాగా కరోనా బారినపడిన రకుల్ వైద్యుల సూచనలు పాటిస్తూ కోలుకుంది. రీసెంట్‌గా చిత్ర షూటింగ్‌లోను పాల్గొంది. తెలుగులో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంతో పాటు నితిన్ సరసన "చెక్" అనే చిత్రం చేస్తుంది.
ఇక జాన్ అబ్రహంతో ఒకటి, అర్జున్ కపూర్‌తో మరో చిత్రం చేస్తుంది. ఇవే కాక అమితాబ్ బచ్చన్- అజయ్ దేవగణ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న "మేడే" చిత్రంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంతేనా.. రెండు తమిళ చిత్రాలు కూడా ఈ అమ్మడు చేతిలో ఉన్నాయి.
ఇలా అరడజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా గ్లామర్ షో చేసింది. మత్తెక్కించే చూపులతో పాటు అదిరిపోయే అందాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అందాలతో సెగలు రేపుతున్న రకుల్‌ని చూసి కుర్రకారు కంటిపై నిద్ర కూడా ఉండడం లేదట. ఆ మధ్య మాల్దీవులకి వెళ్ళినప్పుడు రకుల్ బికినీలో రచ్చ చేసిన విషయం తెలిసిందే.