2.0 అక్షయ్ లుక్ చూసి షాక్ తిన్న రజినీకాంత్... భయపడ్డానంటున్న హీరోయిన్
రాజమౌళి బాహుబలి చిత్రం వసూళ్ల రికార్డును బద్ధలు కొట్టాలన్న కసితో తమిళ దర్శకుడు శంకర్ ఉన్నట్లు కనబడుతున్నారు. బాహుబలి 2 ఒకవైపు తెరకెక్కుతుండగా రోబో 2 అంటే... 2.0 చిత్రాన్ని దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవలే
రాజమౌళి బాహుబలి చిత్రం వసూళ్ల రికార్డును బద్ధలు కొట్టాలన్న కసితో తమిళ దర్శకుడు శంకర్ ఉన్నట్లు కనబడుతున్నారు. బాహుబలి 2 ఒకవైపు తెరకెక్కుతుండగా రోబో 2 అంటే... 2.0 చిత్రాన్ని దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలయ్యాయి. ఈ స్టిల్స్ చూసినవారు చిత్రం ఇక ఏం రేంజిలో ఉంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా 2.0 చిత్రంలో అక్షయ్ కుమార్ పాత్ర అదిరిపాటుగా ఉంటుందని సమాచారం. అందుకు తగ్గట్లుగానే అక్షయ్ గెటప్ కూడా ఉంది. అతడి గెటప్ చూసి సూపర్ స్టార్ రజినీకాంత్ షాక్ తిన్నారట. లుక్ 'అదిరిదిల్లే' అంటూ పొగడ్తలు కురిపించారట. ఇకపోతే అక్షయ్ కుమార్ లుక్ చూసి ఆయన భార్య, ఒకప్పటి హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా జడుసుకున్నదట. పెళ్లయిన తర్వాత తొలిసారిగా అక్షయ్ ను చూసి భయపడ్డానని చెపుతోందట ట్వింకిల్. మరి వచ్చే ఏడాది 2.0 ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో వెయిట్ అండ్ సీ.