Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సల్మాన్ ఖాన్ పిలవని పేరంటానికి వెళ్ళాడా? అదీ అమీ జాక్సన్ కోసమేనా? కొత్త లవర్ దొరికిందా?

బాలీవుడ్ స్టార్ హీరో, ఖాన్ త్రయంలో ఒక్కడైన సల్మాన్ ఖాన్‌కు కొత్త లవర్ దొరికిపోయిందంటూ బిటౌన్‌లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటివరకు ఎంతోమంది హీరోయిన్లతో సల్మాన్ ఖాన్‌కు అఫైర్ ఉందని ప్రచారం జరిగిం

Advertiesment
Salman Khan
, మంగళవారం, 22 నవంబరు 2016 (14:59 IST)
బాలీవుడ్ స్టార్ హీరో, ఖాన్ త్రయంలో ఒక్కడైన సల్మాన్ ఖాన్‌కు కొత్త లవర్ దొరికిపోయిందంటూ బిటౌన్‌లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటివరకు ఎంతోమంది హీరోయిన్లతో సల్మాన్ ఖాన్‌కు అఫైర్ ఉందని ప్రచారం జరిగింది. ఇటీవలే రొమేనియాకి చెందిన మోడల్‌ యులియా వంతూర్‌తో బ్రేకప్ అయ్యిందని వార్తలొచ్చాయి. తాజాగా యులియా రొమేనియాకు తిరిగి వెళ్ళిపోవడంతో రోబో హీరోయిన్ అమీ జాక్సన్‌తో సల్మాన్ ఖాన్ లవ్వులో పడినట్లు బాలీవుడ్ జనం చెవులు కొరుక్కుంటున్నారు. 
 
బ్రిటిష్‌ మోడల్‌ అమీ జాక్సన్‌.. సల్మాన్‌ సోదరుడు సొహైల్‌ నటించిన ఫ్రీకీ అలీలో నటించింది. అప్పుడే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందనుకుంటున్నారు. తాజాగా రజనీ '2.0' ఫస్ట్‌లుక్‌ విడుదల కార్యక్రమానికి ఎవరూ పిలవకుండానే సల్మాన్‌ రావడంతో ఈ పుకార్లకు ఊతమిచ్చినట్లైంది. అప్పటికీ సల్మాన్‌ రజనీ సార్‌ని కలవడానికి పిలవకపోయినా వచ్చేశానని తెలిపాడు. 
 
అదీకాకుండా అమీ జాక్సన్‌, సల్మాన్‌లు కలిసి ఓ చిత్రంలో నటించనున్నట్లు కూడా బీ-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అమీ జాక్సన్‌తో ఏర్పడిన ప్రేమ త్వరలో పెళ్ళి పీటల వరకు వస్తుందని... ఇక లేట్ చేస్తే పెళ్లి జరగదంటూ.. సల్లూభాయ్‌కి ఆయన కుటుంబీకులు చెప్పడంతో.. సల్మాన్ త్వరలో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రేమాయణం ఎంతవరకు సాగుతుందో వేచి చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి2కి తప్పని లీకేజీ తిప్పలు.. అనుష్క, ప్రభాస్‌లపై 2 నిమిషాల వార్ సీక్వెన్స్ లీక్..