Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ విషయం చెప్పగానే ప్రియాప్రకాష్ వారియర్‌కు చిర్రెత్తుకొచ్చిందట...?

Advertiesment
ఆ విషయం చెప్పగానే ప్రియాప్రకాష్ వారియర్‌కు చిర్రెత్తుకొచ్చిందట...?
, మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (20:25 IST)
ప్రియాప్రకాష్ వారియర్ గురించి పరిచయం అక్కర్లేదు. ఒకే ఒక్క సన్నివేశంతో సెన్సేషన్‌గా మారిపోయింది ప్రియాప్రకాష్ వారియర్. ఒరు ఆడార్ లవ్ చిత్రంలో ఆమె కన్ను గీటిన సీన్ యువకుల్లో ఒక అలజడిని లేపింది. ఆ సన్నివేశం మాత్రం బాగా పాపులర్ అయ్యింది కానీ సినిమా మాత్రం పెద్దగా ఆడలేదు. 
 
అదంతా జరిగిన తరువాత ప్రియా కోసం పెద్దపెద్ద హీరోలే ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు. దీంతో ఆమెకు చిత్రపరిశ్రమలో అవకాశాలు కూడా మొదలయ్యాయి. అయితే ప్రియా తన మొదటి సినిమాలో బబ్లీ లుక్స్‌తో కనిపించింది కానీ పెద్దగా గ్లామర్‌ను మాత్రం ప్రదర్సించలేకపోయింది. అయితే ఆ తరువాత ఆమెకు అవకాశాలు బాగా తగ్గుతూ వచ్చాయి. 
 
కానీ ప్రస్తుతం ప్రియాతో షార్ట్ ఫిల్మ్స్ చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారట. ఆమె వెంట తెగ తిరుగుతూ ఒక్క అవకాశం ఇవ్వండని పది యుట్యూబ్ ఛానల్స్ ఓనర్లు వెంటపడ్డారట. అయితే సినిమాల్లో తప్ప తనకు షార్ట్ ఫిల్మ్‌లో నటించడం ఇష్టం లేదని చెబుతోందట ప్రియా. సినిమాల్లో ఎలాగో అవకాశాలు తగ్గుతున్నాయిగా.. షార్ట్ ఫిల్మ్‌తో మీ పేరు మారుమ్రోగేలా చేస్తామని చెప్పడంతో ప్రియాకు కోపమొచ్చిందట. ఇలా ఇంకోసారి మాట్లాడితే బాగుండదని సీరియస్‌గా వార్నింగ్ కూడా ఇచ్చిందట ప్రియాప్రకాష్ వారియర్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#Buttabomma అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' బుట్టబొమ్మ బ్లాక్ బస్టర్(Video)