Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొరటాల శివను పోసాని కృష్ణమురళి బూతులు తిట్టాడట.. పోసానికి అంత ఆవేశం ఎందుకు?

''మిర్చి'', ''శ్రీమంతుడు'', ''జనతా గ్యారేజ్'' సినిమాలతో తెలుగులో టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయాడు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌. తనకంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ దర్శకుడిని పోసాని కృష్ణమురళి బూతులు త

Advertiesment
posani krishna murali
, సోమవారం, 5 సెప్టెంబరు 2016 (14:11 IST)
''మిర్చి'', ''శ్రీమంతుడు'', ''జనతా గ్యారేజ్'' సినిమాలతో తెలుగులో టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయాడు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌. తనకంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ దర్శకుడిని పోసాని కృష్ణమురళి బూతులు తిట్టాడట. అసలు విషయం ఏంటంటే... కొరటాల శివ, బివీస్ రవి వీరిద్దరు పోసాని మురళి దగ్గర శిష్యరికం చేస్తూ పలు చిత్రాలకు రచనసహకరం అందింస్తుండే వాళ్ళు. 
 
అయితే ఒక రోజు హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లో హోటల్ గదిలో సినిమా సీన్లు రాస్తున్నారట. అదే సమయంలో అక్కడికి వచ్చిన పోసాని ఆ హోటల్ గదిని ఎక్కడా లేని ఆవేశం వచ్చి ఇలాంటి గదిలో రాస్తున్నారా అంటూ బూతుల వర్షం కురిపించాడట. పోసాని బూతులు తిడుతున్నా కూడా ఇద్దరు మాట్లాడకుండా ఉండి పోయారట. పోసాని అంతటితో ఆగిపోకుండా... వాళ్ళని వెంట తీసుకొని తన ఆఫీసుకు వచ్చి ఆ దర్శక నిర్మాతలకు కూడా గట్టిగానే క్లాస్ పీకాడట. 
 
పోసానికి ఇంతగా ఎందుకు ఆవేశం వచ్చిందంటే ఒక సినిమాకు మూలం కథే. అలాంటి కథని ఆహ్లాదకరంగా ఉన్న చోట రాయాలని చెప్పి గ్రీన్ పార్క్ హోటల్‌లో రూమ్ బుక్ చేసి వాళ్లని తీసుకెళ్లాడట పోసాని. ఆయన ఆవేశం టీ కప్పులో తుఫాన్ లాంటిదని ఆవేశం వచ్చినప్పుడు బయటకు వెళ్లగక్కుతాడని, అంత గొప్ప మనసు గల వ్యక్తి స్కూల్ నుండి వచ్చాను కాబట్టే ఇంత స్థాయికి ఎదిగానని కొరటాల శివ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెన్సార్‌ బోర్డుపై మండిపడిన రాఖీ సావంత్.. బహిరంగంగా లంచం అడిగితే ఎలా?