సెన్సార్ బోర్డుపై మండిపడిన రాఖీ సావంత్.. బహిరంగంగా లంచం అడిగితే ఎలా?
బాలీవుడ్‌లోనే కాదు, తెలుగులోనూ ఒకటీ అరా సినిమాల్లో ఐటమ్ బాంబ్‌గా అందాల విందు చేసింది రాఖీసావంత్. ఆమె చేసిన సాంగ్స్‌తో వచ్చిన పాపులారిటీ కన్నా, పబ్లిసిటీ స్టంట్స్‌తోనే ఆమెకు ఎక్కువ పాపులారిటీ వచ్చింద
బాలీవుడ్‌లోనే కాదు, తెలుగులోనూ ఒకటీ అరా సినిమాల్లో ఐటమ్ బాంబ్‌గా అందాల విందు చేసింది రాఖీసావంత్. ఆమె చేసిన సాంగ్స్‌తో వచ్చిన పాపులారిటీ కన్నా, పబ్లిసిటీ స్టంట్స్‌తోనే ఆమెకు ఎక్కువ పాపులారిటీ వచ్చింది. ''రాఖీ కా'' బాలీవుడ్ ఐటెం గర్ల్ రాఖీసావంత్ తాజాగా కేంద్ర సెన్సార్ బోర్డ్ పై మండిపడింది. ఆమె నటించిన తాజా సినిమా ఏక కహానీ జూలీ సినిమాకి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇవ్వడక పోవడమే దీనికి ముఖ్య కారణం. దీంతో సెన్సార్ బోర్డ్ పై, చైర్మెన్ పహ్లాజ్ నీహలానీపై రాఖీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
'సెన్సార్ బోర్డ్ ముసేయాలని. పెద్ద నిర్మాతల నుంచి డబ్బులు తీసుకోవడం తప్ప వారు చేస్తున్నది ఏమి లేదు. సెన్సార్ బోర్డ్ సభ్యులు పెద్ద నిర్మాతలను వదిలేసి చిన్ని నిర్మాతలను వేధిస్తున్నారు. సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి బహిరంగంగా లంచం అడుగుతున్నారు. సెన్సార్ బోర్డ్ చైర్మెన్ పదవి నుంచి నిహలానీని తొలగించాలని...ఆయనకు ఏమి తెలియకుంటే పదవికి రాజీనామా చేయాలని...ఆ స్థానంలో నేను కుర్చుంటాను.
నిహలానీ కంటే సమర్ధవంతంగా పనిచేయగలని మండిపడ్డారు. ఈ సినిమాలో అసభ్య దృశ్యాలు లేవు. మేం డబ్బులు ఇవ్వని కారణం చేత ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ విషయంపై బాంబే హై కోర్టుని సంప్రదించాను. సెన్సార్ బోర్డ్‌పై చర్యలు తీసుకోవాలని కోరాను. వారికి తగిన గుణపాఠం చెబుతా. వారిపై పోరాటం చేస్తాను. దేశంలో సెన్సార్ బోర్డ్ లేకుండా తొలగించాలి' అని రాఖీ సావంత్ తనదైన శైలిలో ఘాటు సమాధానమిచ్చారు.