Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాపం... రష్మి.. ''తను వచ్చెనంట'' రిలీజ్‌కు పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకుంది!

బుల్లితెర‌పై యాంక‌ర్‌గా పేరు తెచ్చుకున్న ర‌ష్మి ఆ మ‌ధ్య చేసిన ''గుంటూరు టాకీస్''తో వెండితెర‌పై కూడా అవ‌కాశాల‌ను బాగా అందిపుచ్చుకుంటోంది. రీసెంట్‌గా ఆమె న‌టించిన చిత్రం ''త‌ను వ‌చ్చెనంట''. హార‌ర్ కామెడ

పాపం... రష్మి.. ''తను వచ్చెనంట'' రిలీజ్‌కు పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకుంది!
, మంగళవారం, 25 అక్టోబరు 2016 (13:09 IST)
బుల్లితెర‌పై యాంక‌ర్‌గా పేరు తెచ్చుకున్న ర‌ష్మి ఆ మ‌ధ్య చేసిన ''గుంటూరు టాకీస్''తో వెండితెర‌పై కూడా అవ‌కాశాల‌ను బాగా అందిపుచ్చుకుంటోంది. రీసెంట్‌గా ఆమె న‌టించిన చిత్రం ''త‌ను వ‌చ్చెనంట''. హార‌ర్ కామెడీల‌కు క్రేజ్ పెరుగుతున్న త‌రుణంలో వ‌చ్చిన సినిమా ఇది. గుంటూర్‌ టాకీస్‌తో వచ్చిన గుర్తింపుని క్యాష్‌ చేసేసుకోవడానికి వెనకా ముందు చూడకుండా సినిమాలు ఒప్పేసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు చిక్కుల్లో పడింది. అడపాదడపా చిత్రాలు చేస్తున్నా తన చిత్రాలను జనం పట్టించుకోను కూడా పట్టించుకోవడం లేదు.
 
అయితే సినిమా రంగంలో ఎలాగైనా నిలదొక్కుకోవాలని, వచ్చిన ఊపుని వాడేసుకోవాలని రష్మి నానా తంటాలు పడుతోంది. తన సినిమాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడితే సొంత డబ్బులను సైతం సినిమాలో పెట్టడానికి కూడా ఈ భామ వెనకాడటం లేదు. ''తను వచ్చెనంట'' చిత్రం అలాగే రిలీజ్‌కి తంటాలు పడుతోంటే రష్మి తన భుజాల మీదకి తీసుకుని ఎదురు డబ్బులు పెట్టి రిలీజ్‌ అయ్యేలా చూసుకుందట. ఖచ్చితంగా ఈ చిత్రం హిట్ అవుతుందని రష్మి భావించింది. కానీ ఈ సినిమాని పట్టించుకునే వాళ్లే లేకపోవడంతో కనీసం పోస్టర్‌ ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
 
ఈ సినిమాకి తీసుకున్న పారితోషికంతో పాటు సొంత డబ్బు కూడా పెట్టిన రష్మికి ఇప్పుడు వాటిలో పైసా తిరిగివచ్చే సూచనలు కనపడకపోవడంతో తెగ ఫీలైపోతోందట. కనీసం శాటిలైట్‌ రైట్స్‌ అమ్ముకుందామన్నాడిజాస్టర్ సినిమాని ఎవరూ కొనడానికి ముందుకు రాలేదట. కేవలం ఈ సినిమాలో నటన వరకు పరిమితమై, మిగతాది నిర్మాతల తిప్పలకే వదిలేసినట్టయితే కనీసం ఫ్లాప్‌తో పోయేది. ఇప్పుడు ఉన్నదీ పోయి, వచ్చిందీ పోయి పాపం రష్మికి సరదా బాగానే తీరిపోయిందని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాంగోపాల్ వర్మ 'సర్కార్-3'తో అరవింద్ కేజ్రీవాల్ పాత్ర... ఎలా చూపిస్తారోనన్న ఆసక్తి!