రాంగోపాల్ వర్మ 'సర్కార్-3'తో అరవింద్ కేజ్రీవాల్ పాత్ర... ఎలా చూపిస్తారోనన్న ఆసక్తి!
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తన తాజా చిత్రం 'సర్కార్-3'లో ప్రధాన పోషించే స్టార్స్ ఎవరో వాళ్ళ ఫోటోలతో సహా ట్వీట్ చేశారు. సుభాష్ నాగ్రే అనే పాత్రలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముఖ్య భూమిక పోషిస్తాడని వర్మ త
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తన తాజా చిత్రం 'సర్కార్-3'లో ప్రధాన పోషించే స్టార్స్ ఎవరో వాళ్ళ ఫోటోలతో సహా ట్వీట్ చేశారు. సుభాష్ నాగ్రే అనే పాత్రలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముఖ్య భూమిక పోషిస్తాడని వర్మ తెలిపారు. ఇక జాకీ ష్రాఫ్, మనోజ్ బాజ్ పాయ్, రోనిత్ రాయ్, భరత్ ధబోల్కర్, అమిత్ సాద్, యామీ గౌతమ్, రోహిణి హట్టంగడి ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని ముంబై, విదేశాల్లో షూటింగ్ జరుగుతుందని వర్మ వెల్లడించారు.
మొట్టమొదటిసారిగా అమితాబ్, జాకీ ష్రాఫ్ కలిసి నటిస్తున్నట్టు వెల్లడించారు. ఈ చిత్రంలో కొన్ని నిజ జీవిత క్యారెక్టర్లు దర్శనివ్వబోతున్నాయి. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి లండన్‌లో సెటిలైన విజయ్ మాల్యాను పోలిన 'మైకేల్ వాల్యా' అనే క్యారెక్టర్ 'సర్కార్-3'లో ఉన్న సంగతి ఇప్పటికే వెల్లడైంది. తాజాగా మరో నిజ జీవిత పాత్రకూ ఇందులో చోటుందని వార్తలు వెలువడుతున్నాయి. ఆ పాత్రకు స్ఫూర్తి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కావడం మరో విశేషం. ఈ పాత్రను మనోజ్ బాజ్‌పేయి చేస్తున్నాడు.
ఆ క్యారెక్టర్ పేరు.. గోవింద్ దేశ్ పాండే. ఆల్రెడీ ఈ క్యారెక్టర్లో మనోజ్ లుక్ కూడా యూనిట్ విడుదల చేసింది. కేజ్రీవాల్ తరహలోనే మెడకు మఫ్లర్ చుట్టుకుని కనిపిస్తున్నాడు. అయితే కేజ్రీవాల్ పాత్రను వర్మ ఎలా చూపిస్తాడన్నది సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే ఇండియన్ ఆర్మీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్‌పై వర్మ విమర్శలు గుప్పించాడు. ఆయన ఒక కోతి అన్నాడు. హిందు-ముస్లింకు పుట్టిన క్రాస్ బ్రీడ్ కేజ్రీవాల్ అన్న తరహాలో మాట్లాడాడు. ఈ నేపథ్యంలో మనోజ్ బాజ్‌పేయి పాత్రను నెగెటివ్‌గా చూపించే అవకాశాలున్నాయని ప్రచారం బాలీవుడ్‌లో జోరుగా సాగుతోంది.